ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pelu: తలలో పేలుతో ఇబ్బంది పడుతున్నారా? కట్టడికి మార్గమిదే!

ABN, First Publish Date - 2023-10-12T12:09:01+05:30

తలలో పేలు పడ్డాయంటే పిల్లలకు ఎంతో ఇబ్బంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలు పేలతో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరికి సులువుగా పేలు వ్యాపిస్తాయి. దురదతో ఇబ్బంది పెట్టే ఈ పేలను అరికట్టండిలా..

తలలో పేలు పడ్డాయంటే పిల్లలకు ఎంతో ఇబ్బంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలు పేలతో సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీరికి సులువుగా పేలు వ్యాపిస్తాయి. దురదతో ఇబ్బంది పెట్టే ఈ పేలను అరికట్టండిలా..

  • జుట్టులో మురికి ఎక్కువ ఉన్నపుడు పేలు పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ పిల్లలకు జుట్టు శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి.

  • జుట్టులో పేలు పడ్డాయంటే రక్తహీనతతో బాధపడతారు. పేలకు ప్రధానమైన ఆహారం రక్తం. రక్తాన్ని పీల్చేయటంతో జుట్టు త్వరగా ఊడిపోతుంది. అందుకే తలలో పేలు ఉంటే వేపాకు, తులసి ఆకులను పేస్ట్‌గా చేసి ఈ చూర్ణాన్ని జుట్టుకు పట్టించాలి. ఈ చూర్ణానికి పసుపు, కొబ్బరి నూనె కలిపి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత జుట్టును శుభ్రపరిస్తే చక్కని ఫలితం ఉంటుంది.

  • పెరుగు, నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.

  • ఫంక్షన్లలో పెద్ద వాళ్లు లేదా ఇతరులు వాడిన దువ్వెనలు, తువాళ్లు ద్వారా సులువుగా వ్యాప్తి చెందుతాయి. ఇలా చెందకుండా ఉండాలంటే వ్యక్తిగత వస్తువులు ఉంచుకోవటం మంచిది. నిద్రపోయే సమయంలో సులువుగా పేలు వ్యాప్తి చెందుతాయి. అందుకే ముందుస్తు అవగాహన ఉండాలి.

  • ఎంత జాగ్రత్తగా ఉన్నా.. జుట్టులో పేలు పడ్డాయంటే మాత్రం అలానే వదిలేయలేం కదా! రోజుకు పేలు పది దాకా జుట్టులో గుడ్డు పెడతాయి. దీని వల్ల వేగంగా పేలు వ్యాప్తి చెందుతాయి. అందుకే పేలు ఉన్నాయన్న వెంటనే కొబ్బరినూనెలో సోంపు నూనె కలిపి మిక్స్‌ చేసి జుట్టుకు పట్టిస్తే సరి.

  • నీటిలో కొద్దిగా బేకింగ్‌ సోడా కలిపి జుట్టుకు పట్టించాలి. దీనివల్ల పేల సమస్య తగ్గిపోతుంది. పేలు దువ్వెనలు వాడటంతో పాటు నిత్యం జాగ్రత్తగా ఉంటేనే పేలు వ్యాప్తి చెందవు.

Updated Date - 2023-10-12T12:09:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising