ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Happy Hormone: సంతోషాన్నిచ్చే హార్మోన్‌ కోసం...

ABN, First Publish Date - 2023-01-24T14:36:37+05:30

అకారణంగా మానసిక కుంగుబాటు ఆవరిస్తున్నా, ఎంతో ఇష్టమైన వ్యాపకాల మీద అనాసక్తి పెరుగుతున్నా మెదడులో ఉత్పత్తయ్యే హ్యాపీ హార్మోన్‌ సెరటోనిన్‌ ఉత్పత్తి తగ్గిందని భావించాలి. మన

హ్యాపీగా ఉండాలంటే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారణంగా మానసిక కుంగుబాటు ఆవరిస్తున్నా, ఎంతో ఇష్టమైన వ్యాపకాల మీద అనాసక్తి పెరుగుతున్నా మెదడులో ఉత్పత్తయ్యే హ్యాపీ హార్మోన్‌ సెరటోనిన్‌ ఉత్పత్తి తగ్గిందని భావించాలి. మన జీవనశైలి, ఆహారపుటలవాట్లు సెరటోనిన్‌ ఉత్పత్తిని కుంటుపరుస్తాయి. కాబట్టి వాటిని సరిదిద్దుకుని, ఫీల్‌ గుడ్‌ హార్మోన్‌ సెరోటినిన్‌ ఉత్పత్తిని పెంచుకోవాలి.

ట్రిప్టోఫాన్‌: లేత మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ఈ అమీనో యాసిడ్‌ ఉంటుంది. ఇది సెరటోనిన్‌ హార్మోన్‌ వృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ అమీనో యాసిడ్‌ పుష్కలంగా ఉండే పదార్థాలను ఎక్కువగా తినాలి.

మర్దన: మర్దన తర్వాత సెరటోనిన్‌ మోతాదు పెరుగుతుంది. ఇందుకు కారణం మర్దన వల్ల స్ట్రెస్‌ హార్మోన్‌ కార్టిజాల్‌ మోతాదు 30% మేరకు తగ్గడమే! కాబట్టి వీలును బట్టి మసాజ్‌ చేయించుకుంటూ ఉండాలి.

బి విటమిన్లు: సరిపడా బి విటమిన్లతో సెరటోనిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉంటుంది.

సూర్యరశ్మి: ఎండ సోకడం వల్ల మెదడులో సెరటోనిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది.

మెగ్నీషియం: ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, చేపలు (Fish), అరటిపండ్లు (Bananas), బీన్స్‌లలో మెగ్నీషియం మోతాదు ఎక్కువ. ఈ పోషకం సెరటోనిన్‌ ఉత్పత్తిని పెంచుతుంది.

చక్కెర: చక్కెర మోతాదు మించితే భావోద్వేగాలు ప్రభావితమవుతాయి. సెరటోనిన్‌ పరిమాణం తగ్గుతుంది.

ధ్యానం: సెరటోనిన్‌ ఉత్పత్తికి అవసరమైన 5-హెచ్‌ఐఐఎ అనే యాసిడ్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా ఫీల్‌ గుడ్‌ హార్మోన్‌ (feel good hormone) మోతాదు కూడా పెరుగుతుంది.

వ్యాయామం: క్రమం తప్పక వ్యాయామం చేయడం అవసరం. వ్యాయామం (exercise)తో గుండె వేగం (heart) పెరగడం ద్వారా సెరటోనిన్‌ ఉత్పత్తి ఊపందుకుంటుంది.

ఒత్తిడి: యోగా (Yoga), నచ్చిన అభిరుచులను సాధన చేయడం వల్ల ఒత్తిడి అదుపులోకి రావడంతో పాటు మెదడు (brain)లో సెరటోనిన్‌ వృద్ధి అవుతుంది.

Updated Date - 2023-01-24T14:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising