ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Coconut Water: కొబ్బరి నీళ్లు ఈ విధంగా తీసుకుంటే మాత్రం..!

ABN, First Publish Date - 2023-10-13T11:32:07+05:30

చాలా మందికి ఎండలో బాగా తిరిగినా బాగా అలసటగా అనిపించినా వెంటనే గుర్తుకువచ్చేది కొబ్బరి బొండాం. ఎన్నో రకాల శీతల పానీయాలున్నా దాహార్తిని తీర్చి మెరుగైన ఆరోగ్యాన్ని అందించే ది కొబ్బరి బొండాం

చాలా మందికి ఎండలో బాగా తిరిగినా బాగా అలసటగా అనిపించినా వెంటనే గుర్తుకువచ్చేది కొబ్బరి బొండాం. ఎన్నో రకాల శీతల పానీయాలున్నా దాహార్తిని తీర్చి మెరుగైన ఆరోగ్యాన్ని అందించే ది కొబ్బరి బొండాం మాత్రమే. కొబ్బరి బొండా నీటిని సర్వరోగ నివారిణిగా భావిస్తారు. కొబ్బరి బొండాం నీటిని వారం రోజలు క్రమంగా తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

  • నిత్యం కొబ్బరి బొండాం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

  • శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి, యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి బొండం తోడ్పడుతుంది.

  • శీతాకాలంలో కూడా కొబ్బరి బొండాం తాగడంవల్ల జలుబు రాకుండా ఉంటుంది.

  • కొబ్బరి బొండాన్ని వారం పాటు తీసుకుంటే ఉత్సాహం వస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

  • కొబ్బరి నీళ్లు తాగడంవల్ల శరీరంలో టాక్సిన్స్‌ తొలగడమే కాక కిడ్నీల్లో రాళ్ళు కూడా క్రమేపి తగ్గుతాయి.

  • కొబ్బరి బొండాం నిత్యం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. షుగర్‌ పేషెంట్లు కూడా డాక్టర్ల సలహా మేరకు కొబ్బరి బొండాం తాగడం మంచిది.

  • శరీరానికి కావాల్సిన ఫైబర్‌ను కొబ్బరిబొండాంలోని నీళ్లు అందిస్తాయి.

  • వారం రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి బొండాం తాగితే బాడీలో కొవ్వు శాతం క్రమంగా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

  • కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్‌ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది.

  • చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరినీళ్లు వారం రోజులు పాటు తాగితే చర్మకాంతి మెరుగుపడుతుంది.

  • తల్లిపాలలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ కొబ్బరి బోండాం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి ఈ నీళ్లను తాగితే మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది.

  • గర్భిణులు నిత్యం కొబ్బరి నీళ్ళు తాగడంవల్ల గర్భాశయంలో ఉన్న సమస్యలు తగ్గి, బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

  • కొబ్బరి నీళ్లు కంటిచూపు మెరుగుపరచడానికీ తోడ్పడుతుంది.

  • కొబ్బరినీళ్లు తాగితే చర్మంపై ముడతలు తగ్గి, వయసు తక్కువగా కనబడుతుందని చెబుతున్నారు.

-హైదరాబాద్, నార్సింగ్‌, అక్టోబర్‌ 12(ఆంధ్రజ్యోతి)

Updated Date - 2023-10-13T11:32:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising