ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NPTIలో పీజీ డిప్లొమా ప్రవేశానికి నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2023-01-11T09:53:23+05:30

హరియాణాలోని నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (National Power Training Institute)(ఎన్‌పీటీఐ)- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా (Post Graduate Diploma) (వింటర్‌ సెషన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌

నోటిఫికేషన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరియాణాలోని నేషనల్‌ పవర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (National Power Training Institute)(ఎన్‌పీటీఐ)- పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా (Post Graduate Diploma) (వింటర్‌ సెషన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి ఏడాది. ఇందులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. పవర్‌ ప్లాంట్‌ ఇంజనీరింగ్‌, రెన్యూవబుల్‌ ఎనర్జీ అండ్‌ గ్రిడ్‌ ఇంటర్ఫేస్‌ టెక్నాలజీస్‌ అనే స్పెషలైజేషన్‌లు ఉన్నాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా పలు మాడ్యూల్స్‌, ఇండస్ట్రియల్‌/ఫీల్డ్‌ ట్రెయినింగ్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్‌ చివర్లో ఫైనల్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తారు. మొత్తం 360 సీట్లు ఉన్నాయి. వీటిలో 25 శాతం సీట్లను పవర్‌ సంస్థలు స్పాన్సర్‌ చేసిన అభ్యర్థులకు ప్రత్యేకించారు.

పవర్‌ ప్లాంట్‌ ఇంజనీరింగ్‌: ఈ స్పెషలైజేషన్‌ (Specialization)లో గ్యాస్‌, సోలార్‌, విండ్‌, బయోమాస్‌ తదితర పవర్‌ ప్లాంట్‌ (Power plant)లకు సంబంధించిన ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ అంశాలు వివరిస్తారు. పవర్‌ సెక్టార్‌ విభాగాల నిర్వహణకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ఫరీదాబాద్‌, నాగ్‌పూర్‌, నైవేలీ, గువహటి, శివపురి క్యాంప్‌సలలో ఒక్కోదానిలో 60 చొప్పున మొత్తం 300 సీట్లు ఉన్నాయి.

రెన్యూవబుల్‌ ఎనర్జీ అండ్‌ గ్రిడ్‌ ఇంటర్ఫేస్‌ టెక్నాలజీస్‌: ఈ స్పెషలైజేషన్‌లో రెన్యూవబుల్‌ ఎనర్జీ సోర్సె్‌సకు సంబంధించిన టెక్నాలజీ, ఎకనామిక్స్‌, పాలసీ, ఎనర్జీ సిస్టమ్స్‌, సప్లయ్‌ తదితర అంశాలు ఉంటాయి. సోలార్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, ఫొటోవోల్టాయిక్‌ సిస్టమ్స్‌, థర్మల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, విండ్‌ ఎనర్జీ, బయోమాస్‌, జియోథర్మల్‌, టైడల్‌ అండ్‌ వేవ్‌ ఎనర్జీ, హైడ్రోజన్‌ అండ్‌ ఫ్యూయెల్‌ సెల్స్‌, గ్రిడ్‌ ఇంటిగ్రేషన్‌, ఇంటర్ఫేసింగ్‌ టెక్నాలజీస్‌ అంశాలు వివరిస్తారు. శివపురి క్యాంప్‌సలో 60 సీట్లు ఉన్నాయి.

అర్హత వివరాలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో (బీఈ/ బీటెక్‌/ తత్సమాన కోర్సు)(మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌/సీ అండ్‌ ఐ/ పవర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి నిబంధనలు లేవు.

ఎంపిక: అకడమిక్‌ ప్రతిభ, టెలిఫోన్‌/ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ, కౌన్సెలింగ్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అకడమిక్‌ ప్రతిభకు 90 శాతం, ఇంటర్వ్యూకి 10 శాతం వెయిటేజీ ఇస్తారు.

ముఖ్య సమాచారం

కోర్సు ఫీజు: నాన్‌ స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు రూ.2,30,000; స్పాన్సర్డ్‌ అభ్యర్థులకు రూ.3,60,000. అదనంగా 18 శాతం జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.500

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 16

ఎంపికైన అభ్యర్థుల లిస్ట్‌ విడుదల: ఫిబ్రవరి 20న

కౌన్సెలింగ్‌ తేదీ: ఫిబ్రవరి 22

కోర్సు ప్రారంభం: ఫిబ్రవరి 27 నుంచి

సీట్లు మిగిలిన పక్షంలో స్పాట్‌ అడ్మిషన్స్‌: మార్చి 6న

వెబ్‌సైట్‌: npti.gov.in

Updated Date - 2023-01-11T09:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising