ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kaloji అనుబంధ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్లు

ABN, First Publish Date - 2023-01-07T16:17:52+05:30

వరంగల్‌ (Warangal)లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (Kaloji Narayana Rao University of Health Sciences) (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్)-అనుబంధ కళాశాలల్లో

నోటిఫికేషన్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ (Warangal)లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ (Kaloji Narayana Rao University of Health Sciences) (కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్)-అనుబంధ కళాశాలల్లో ఆయుష్‌ పీజీ (ఎండీ) కోర్సుల్లో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదల చేసింది. దీని ద్వారా హోమియో (Homeo), ఆయుర్వేదం (Ayurveda), యునానీ కోర్సుల్లో కాంపిటెంట్‌ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ఏఐఏపీజీఈటీ 2022 స్కోర్‌, కౌన్సెలింగ్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల (Telugu states) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్ల వివరాలను కౌన్సెలింగ్‌ నాటికి ప్రకటిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్‌లు వర్తిస్తాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. కోర్సు పూర్తయ్యే వరకు స్టయిపెండ్‌ సౌకర్యం కల్పిస్తారు.

క్యాంపస్‌లు

హోమియో: జేఎస్‌పీఎస్‌ గవర్నమెంట్‌ హోమియో మెడికల్‌ కాలేజ్‌ - హైదరాబాద్‌

ఆయుర్వేదం: బీఆర్‌కేఆర్‌ గవర్నమెంట్‌ ఆయుర్వేదిక్‌ మెడికల్‌ కాలేజ్‌ - హైదరాబాద్‌

యునానీ: గవర్నమెంట్‌ నిజామియా టీబీ కాలేజ్‌ - హైదరాబాద్‌

అర్హత: ఎండీ (హోమియో) కోర్సులో ప్రవేశానికి అయిదున్నరేళ్ల వ్యవధిగల బీహెచ్‌ఎంఎస్‌ పూర్తిచేసి ఉండాలి. ఎండీ (ఆయుర్వేదం) కోర్సు లో ప్రవేశానికి అయిదున్నరేళ్ల వ్యవధిగల బీఏఎంఎస్‌ ప్రోగ్రామ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎండీ (యునానీ)లో ప్రవేశానికి బీయూఎంఎస్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి కోర్సులో డిసెంబరు 31 నాటికి ఇంటర్న్‌షిప్‌ (Internship) పూర్తిచేసి ఉండాలి. కోర్సుని అనుసరించి ఏఐఏపీజీఈటీ 2022 (హోమియో/ ఆయుర్వేదం/ యునానీ) అర్హత తప్పనిసరి. ఇందులో జనరల్‌ అభ్యర్థులకు 50 శాతం; జనరల్‌ కేటగిరీ దివ్యాంగులకు 45 శాతం; ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి.

ముఖ్య సమాచారం

రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.4,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.3,000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 13

వెబ్‌సైట్‌: knruhs.telangana.gov.in

Updated Date - 2023-01-07T16:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising