యర్రగుంటపాడు... శ్రీమంతుడు
ABN, First Publish Date - 2023-02-03T23:31:28+05:30
ఏ పని చేయాల్సి వచ్చినా... నాకేంటి? అని ప్రశ్నించుకునే ఈ రోజుల్లో జన్మనిచ్చిన గ్రామం రుణం తీర్చుకుంటున్నాడో పారిశ్రామిక వేత్త! కోట్ల రూపాయలు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నాడు. వేంసూరు మండలం యర్రగుంటపాడు గ్రామానికి చెందిన డాక్టర్ భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌లో నోస్ ల్యాబ్ కంపెనీ నడుపుతున్నారు. తన కంపెనీలో స్వగ్రామానికి చెందిన వారికి ఉపాధి కల్పిస్తూనే తన సంపాదనలో కొంత మొత్తాన్ని గ్రామం అభివృద్ధికి ఖర్చు చేయాలని సంకల్పించారు.
వేంసూరు, ఫిబ్రవరి 3: ఏ పని చేయాల్సి వచ్చినా... నాకేంటి? అని ప్రశ్నించుకునే ఈ రోజుల్లో జన్మనిచ్చిన గ్రామం రుణం తీర్చుకుంటున్నాడో పారిశ్రామిక వేత్త! కోట్ల రూపాయలు ఖర్చు చేసి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నాడు. వేంసూరు మండలం యర్రగుంటపాడు గ్రామానికి చెందిన డాక్టర్ భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌లో నోస్ ల్యాబ్ కంపెనీ నడుపుతున్నారు. తన కంపెనీలో స్వగ్రామానికి చెందిన వారికి ఉపాధి కల్పిస్తూనే తన సంపాదనలో కొంత మొత్తాన్ని గ్రామం అభివృద్ధికి ఖర్చు చేయాలని సంకల్పించారు.
రూ.కోట్లతో అభివృద్ధి పనులు...
యర్రగుంటపాడులో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్‌వాల్స్, సైడ్ డ్రెయినేజీలను నిర్మించా లని నిర్ణయించారు. గ్రామంలోని ప్రధాన రహదారితోపాటు అంతర్గత రహదారులను సీసీ రోడ్లతోపాటు సైడ్‌వాల్స్, సైడ్ డ్రెయినేజీలను నిర్మించారు. రూ.కోటితో సిమెంట్ రోడ్లు, డ్రెయినేజీలు, సైడ్‌వాల్స్ నిర్మాణాలు పూర్తిచేశారు. ఈ సిమెంట్ రోడ్లకు రెండువైపులా పూలమొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుంది.
రూ.45 లక్షలతో పాఠశాలల అభివృద్ధి
గ్రామంలో రూ.10లక్షలతో సీపీఎస్ పాఠశాలను అభివృద్ధి చేశారు. అలాగే తాను చదువుకున్న వేంసూరు హైస్కూల్‌లో రూ.35 లక్షలతో బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. అదేవిధంగా రూ.లక్షలతో మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేయించారు.
రామాలయ నిర్మాణం
గ్రామంలో రూ.75 లక్షలతో రామాలయ నిర్మాణాన్ని పూర్తిచేయించారు. ఈనెల ఐదోతేదీన(ఆదివారం) సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఆ లయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఆలయాన్ని రంగులతో ముస్తాబు చేశారు.
Updated Date - 2023-02-03T23:31:29+05:30 IST