ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 09 01 2023

ABN, First Publish Date - 2023-01-09T00:26:21+05:30

మద్దూరి నగేష్‌ బాబు కవితా పురస్కారం అలిశెట్టి పురస్కారం కవితా సంపుటాలకు ఆహ్వానం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మద్దూరి నగేష్‌ బాబు కవితా పురస్కారం

మద్దూరి నగేష్‌ బాబు స్మారక కవితా పురస్కారం (2020-2022) రూ.5వేల ప్రధాన పురస్కారానికి పి.శ్రీనివాస్‌ గౌడ్‌ ‘ధైర్యవచనం’ ఎంపికేౖంది. రూ.1000 చొప్పున ఐదు ప్రోత్సాహక బహుమతులకు ఎంపికేౖనవారు: గూటం స్వామి (తిప్పుడు పొట్లం), అవని శ్రీ (ధిక్కార ఖడ్గం), సరికొండ నరసింహ రాజ్‌ (నెత్తుటి పాదాలు), అమూల్య చంద్‌ (ఒంటి రొమ్ము తల్లి), సుంకర గోపాల్‌ (మా నాయిన పాట) ఎంపికయ్యాయి. జనవరి 10 సా.5గం.లకు, ఠాగూర్‌ గ్రంథాలయం విజయవాడలో పురస్కార ప్రదానం జరుగుతుంది. మరిన్ని వివరాలకు: 9676609234.

తంగిరాల సోని

అలిశెట్టి పురస్కారం

తెలంగాణ రచయితల వేదిక (తెరవే) కరీంనగర్‌ 2023 సంవత్సరానికి గాను ఇవ్వనున్న అలిశెట్టి ప్రభాకర్‌ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారానికి దివంగత సాహితీ వేత్త నిజాం వేంకటేశం ఎంపికయ్యారు. అలిశెట్టి జయంతి - వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌ ఫిల్మ్‌ భవన్‌లో ఈ నెల 12 సాయంత్రం పురస్కార ప్రదాన సభ జరుగుతుంది. నారదాసు లక్ష్మణరావు, గాజోజు నాగభూషణం, కొండి మల్లారెడ్డి, అన్నవరం దేవేందర్‌ తదితరులు పాల్గొంటారు.

సి.వి. కుమార్‌

కవితా సంపుటాలకు ఆహ్వానం

పాలమూరు సాహితీ అవార్డులకు 2022 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మూడేసి ప్రతులను జనవరి 31లోపు పంపాలి. బహుమతి పొందిన ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116/- నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు. చిరునామా: భీంపల్లి శ్రీకాంత్‌, ఇం.నెం.8-5-38, టీచర్స్‌ కాలని, మహబూబ్‌ నగర్‌ - 509001. వివరాలకు ఫోన్‌: 9032844017.

భీంపల్లి శ్రీకాంత్‌

Updated Date - 2023-01-09T00:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising