ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సగం సగం నీడలు

ABN, First Publish Date - 2023-04-17T03:42:24+05:30

మనుషుల మధ్యకు వెళ్ళినప్పుడు కోపాన్ని కళ్ళల్లో పెట్టుకొని బయలుదేరకు! అది ఒక అడ్డదిడ్డమైన ఆయుధం! కింద జారిపడితే నీ కాళ్లైనా తెగిపోవచ్చు, ఎదుటివాడి తలైనా ఎగిరిపోవచ్చు!...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనుషుల మధ్యకు వెళ్ళినప్పుడు

కోపాన్ని కళ్ళల్లో పెట్టుకొని బయలుదేరకు!

అది ఒక అడ్డదిడ్డమైన ఆయుధం!

కింద జారిపడితే

నీ కాళ్లైనా తెగిపోవచ్చు,

ఎదుటివాడి తలైనా ఎగిరిపోవచ్చు!

మనిషి బాధ పడినప్పుడు

గుండె పగిలిపోతే,

గ్లాసు పగిలిపోయినట్టు

గల గలా శబ్దమేమీ రాదు.

కానీ, జీవితమంతా

పెంకులు గుచ్చుకొంటూనే వుంటాయి.

అందరం అనుకొన్నట్టు

సముద్రాలు, ప్రవాహాలు

అంత లోతుగా ఏమీ వుండవు.

వాటికన్నా, కళ్ళల్లో పొంగిన

కన్నీళ్ళే ఎక్కువ లోతుగా వుంటాయి.

మనసు గాయపడినవాళ్ళు

మెడికల్‌ షాపుల్లోకి వెళ్ళి-

ఆయింట్‌మెంట్లు, బాండేజీలు తెచ్చుకోరు.

రాత్రంతా చెమట తుడుచుకొన్న కర్చీఫ్‌ తోనో,

కలలు నలిగిన తలదిండు తోనో

కళ్ళను కాపడం పెట్టుకొంటారు.

ఓడిపోయినవాళ్ళు ఎదురుపడితే,

పక్కకు వెళ్ళకుండా పలకరించు!

జీవిత పాఠాలు తెలుస్తాయి.

వాళ్ళను గుర్తుపట్టడం చాలా సులభం!

గాయడినవాళ్ళు

ఎప్పుడూ నవ్వుతూ వుంటారు.

ప్రహారీ గోడల మీద పావురాలు వాలితే,

ఏ జైలు కూడా తాజ్‌మహల్‌ కాలేదు.

సమాధుల చుట్టూ పూలు పూస్తే,

స్మశానం బృందావనం కాబోదు.

స్వేచ్ఛ ఉన్నచోటనే

సౌందర్య ముంటుంది.

ఊపిరాడే దారిలోనే

పరిమళం వీస్తుంది

మనిషికి ప్రశ్నలు ప్రాణాలు.

తాగినవాడు పెళ్ళి బారాత్‌లో,

తల్వార్‌ తిప్పినట్టు అరవకూడదు.

పస్తులుంచిన వాడిని

నిలదీయడానికి

ప్రతిపక్షంలో కూర్చొని

ఎదిరించడానికి సంధించాలి.

ఈ గాయం నా వెంట వెంటనే నడుస్తుంది

నేను విసుగుతో కసురుకుంటే,

నేను తప్ప, నీకు తోడు ఎవరుంటారని,

అమాయకంగా అడుగుతుంది.

ఈ సభలో చదవడానికి,

నావద్ద కవిత్వం లేదు.

వీధుల్లో పారేసిన చిత్తు కాగితాలు,

బయట దొరికిన పిచ్చి సామాన్లు,

కొన్ని కొన్ని ఏరుకొని తెచ్చాను.

మీరు అనుమతిస్తే యీ మూట విప్పి,

మీకు చూపించి వెళ్ళిపోతాను

ఆశారాజు

asharaju.poet@gmail.com

Updated Date - 2023-04-17T03:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising