ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నువ్వూ నేనూ కాలం

ABN, First Publish Date - 2023-10-16T01:40:22+05:30

నిన్ను చూసినప్పుడల్లా అమ్మ ఒడిలో కూర్చొని నాన్న కళ్ళలో తన బొమ్మ చూసి మురిసిపోతున్న పసిపాపలా కనిపిస్తావు...

1

నిన్ను చూసినప్పుడల్లా

అమ్మ ఒడిలో కూర్చొని

నాన్న కళ్ళలో తన బొమ్మ చూసి మురిసిపోతున్న

పసిపాపలా కనిపిస్తావు

2

నీతో ఆడుకోవాలనుకుంటాను

అప్పుడు నువ్వు నా నీడను

ఎక్కడో దాచి

నన్ను ఆట పట్టిస్తావు

3

నీ స్పర్శను మోసుకుంటూ నా ఆత్మ

అనంత సంచారంలో అలసిపోయి

కాలానికీ కాలానికీ మధ్య

విరామ చిహ్నంలా

విశ్రాంతి తీసుకుంటుంది

4

తేనెబొట్టు లాంటి నీ కంఠంపై

నా అధరాక్షరాల నిర్నిద్ర ముద్రల కవాతు

నా జన్మ జన్మల కవిత్వమవుతుంది

5

నేను నువ్వైన నాతో

ఒక చుంబనాలింగనం కోసం

నా జిహ్వాగ్రం మీద

ప్రపంచం వేలాడుతుంది

6

నువ్వు నన్ను

శూన్యాన్ని చేసి

గాలి రెప్పలతో రంగులు వేస్తావు

7

నీలో నాలో విశ్వమంతా

రెక్కల మనుషుల చుక్కల లోకమై

ఏటవాలు సంధ్యలో

కోటి రంగుల ఏటి కెరటాల పాటవుతుంది

8

ఇదంతా ఎవరి గురించి రాస్తున్నావు అని ఎవరైనా అడిగితే

బొట్టు బొట్టుగా యుగాలు యుగాలుగా

నాలోకి ఇంకిన నిన్ను చూపిస్తాను-

9

కవిత్వం అంటే

ఒక స్త్రీని ప్రసవించడమే

అని చెప్తాను

ప్రసాదమూర్తి

84998 66699

Updated Date - 2023-10-16T01:40:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising