ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి

ABN, First Publish Date - 2023-02-04T22:19:59+05:30

నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు పరిష్కారించాలని పలుమండలాల ప్రజాప్రతినిధులు జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కలిసి కోరారు.

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కమల్‌రాజు, సర్పంచ్‌లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధిర, ఫిబ్రవరి 4: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలు పరిష్కారించాలని పలుమండలాల ప్రజాప్రతినిధులు జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ను కలిసి కోరారు. మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌కు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో ఉన్న రెవెన్యూ, పట్టాదారు పాసుపుస్తకాలు తదితర సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. మఽదిర మండలం వంగవీడు, ఆత్కూరు, మర్లపాడు, ఎర్రుపాలెం మండలంలోని సత్యనారాయణపురంలోని భూ సమస్యలు, బోనకల్‌ మండలంలోని బ్రాహ్మణపల్లిలో నెలకొన్న రెవెన్యూ సమస్యలను సర్పంచ్‌లు లింగాల కమల్‌రాజుతో కలిసి కలెక్టర్‌కు వివరించారు. ఎర్రుపాలెం మండలంలోని విలేకరులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలను సంబందిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-02-04T22:20:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising