ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండ ఎరక

ABN, First Publish Date - 2023-01-09T00:29:46+05:30

కొండ ఉన్నచోటె ఉన్నది దూరంగా ఉన్న ఊరు కొండకు చేరువయి పోతున్నది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండ ఉన్నచోటె ఉన్నది

దూరంగా ఉన్న ఊరు

కొండకు చేరువయి పోతున్నది

1

కుంభ వానలు కురిసిన

కుంపటెండలు ఉరిమిన

మింటి నుంచి పిడుగులెన్నొ

వంటిపయిన రాలిన

చెక్కు చెదరక ఆది నుండి

పాదునొదల కున్నది

2

ఎత్తు దప్ప కొండలో

ఏముంది బండనుకుంటం

వట్టి రాళ్ల గుట్టనె

మనకేమి మేలనుకుంటం

సుట్టు ఉన్న నీటి తావుల

పుట్టినిల్లని ఎరుగము

3

కదలదు మెదలదు

పెదవినేమి విప్పదు

తాబేలు వోలె సెవులను

తానేడ దాసుకున్నదొ

మనమన్న మాటలు పొల్లుబోక

మనకె వినిపిస్తుంటది

4

కొప్పున పాపిడి బిళ్ళలొ

ఈ కొండ రాతి పొడుపులొ

సన్నంచు పొదల సీరలొ

ఏ మానులేని తీగలొ

పాదాల కద్దిన పసుపుల

పలుగంచు మెత్తని ఇసుకలొ

5

కదలనట్టి కొండ పొందుకు

కదిలి వస్తది ముసుగు కన్నియ

మగత కన్నుల మొగిలి పయిట

కొండ సైగకె జారిపోతది

పసరు టాకుల పొదల వాకిట

కొసరు గాలుల సినుకులాట

6

ముండ్ల పొదల కలిమి మంగల

బలగమంత కొండ నుంటది

వాన సినుకుల సిగురు మేసి

జానతనముతొ ఇరగబూస్తయి

సాగు లేకనె కొండతావు

తేనెలూరె ఫలములిస్తది

7

వనము లిరుగ కాసే కాలము

వంక సూడని రామసిలుకలు

కాతలేని పునాస కాలము

మేత నెతుకుతు కొండ కొస్తయి

వగరు నొలికే దోర గింజలు

వంక ముక్కుపుడక లైతయి

8

వానకాలము ఊళ్ళు బీళ్ళు

వండు చిత్తడి వెగటు గుంటవి

ఎంత తడిసిన గాని

కొండ

వెంటనే అది తుడుసుకుంటది

తడికి జడిసి మంద గుంపులు

తాళ్ళు తెంపుక కొండ కోతయి

9

ఇలపయిన వింత గ్రహముల

కనిపించు భరణి రుతువుల

కస్తూరి జింకల జాడలా

నీరింకి పోయిన తోవలు

నీరెండ రేల గంధము

ఈ కొండ మోముకు

అందం

10

కరుకు దేలిన రాల్లె కాని

కడుపులొ కనపడని జాలి

ఉచ్చు వలలో జిక్కి జీవులు

ఊపిరాడక గింజుకుంటె

రాతి మొనల సేతి వేళ్లె

రాపిడితొ ఉరుల దెంపును

11

పొట్టి వెంపలి గొడుగు కింద

పలుగు రాల్లె సలువగుంటయి

ఎండ ధాటికి కందనీయక

ఎల్లవేళల నీడ పడతయి

అందుకె ప్రతి ఊరి అందం

బెందడయి అది నిలిపుకుంటది

12

కొండ పైన గుండము

నిండదు అది ఎండదు

రాలిన పొదపండుటాకు

వగరులొ ఏముందొ గాని

తీర్థమని సేవించె వారల

తీరునట ఏ రోగమయిన

13

పొత్తి కడుపు లోపల

పోటెత్తే నీటి పాయలో

కొండపందిరి నవ్వుల

సందేల కాసిన వెన్నెల

కమ్మిన మబ్బుల వేళలో

కనిపించు ఆగిన నావల

14

ఊరు దాటని వారికి

తన ఉనికి తెలియనివ్వదు

సెట్టు పుట్టల బంధమెరిగిన

సెలిమి పైనే మక్కువ

అన్ని మరిసె ఎరుకనెరిగిన

ఎరుకకె తన గుట్టు ఎరుక

గోరటి వెంకన్న

Updated Date - 2023-01-09T00:29:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising