ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం ఖాయం

ABN, First Publish Date - 2023-04-26T00:39:10+05:30

వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మధిరలో మంగళవారం బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం చారు.

మాట్లాడుతున్న కమల్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మధిరటౌన్‌, ఏప్రిల్‌ 25: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధిస్తారని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. మధిరలో మంగళవారం బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిం చారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ అందరూ కుటుంబ అవసరాల కోసం డబ్బులు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తే ఈ రాష్ట్ర ప్రజల కోసం, బావిత రాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టులు కట్టి నీళ్లను డిపాజిట్‌ చేశారన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలను రగిలించి లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీఫ్‌ విప్‌గా, డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఏమీ చేయలేని భట్టి విక్రమార్క కల్లబొల్లి మాటలు చెబుతూ ఊరూరు తిరుగుతున్నారన్నారు. అంతకు ముందు పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ బీఆర్‌ఎస్‌ జెండాను ఎగుర వేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యుడు బొమ్మెర రాంమూర్తి, మధిర మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మొండితోక లత, ఆత్మ కమిటీ చైర్మన్‌ గుర్రం రామారావు, చావా రామకృష్ణ, రంగిశెట్టి కోటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరావు, ఎంపీపీలు సామినేని హరిప్రసాద్‌, దేవరకొండ శిరీష, మొండెం లలిత, పూర్ణయ్య, జడ్పీటీసీలు కిషోర్‌, పసుపులేటి దుర్గ పాల్గొన్నారు.

Updated Date - 2023-04-26T00:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising