ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad : దారుణం.. పురుషాంగం కోసుకుని ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య!

ABN, First Publish Date - 2023-07-09T21:42:36+05:30

జీవితంలో ఏదో సాధించాలని అనుకున్నాడు.. ఎంబీబీఎస్ (MBBS) చదివి నలుగురికి ఉపయోగపడాలని భావించాడో విద్యార్థి..! ఒకట్రెండు సంవత్సరాలు ఆగితే కుమారుడ్ని ఉన్నతస్థానంలో చూస్తామని తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు.. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ శవమై కనిపించాడు!..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవితంలో ఏదో సాధించాలని అనుకున్నాడు.. ఎంబీబీఎస్ (MBBS) చదివి నలుగురికి ఉపయోగపడాలని భావించాడో విద్యార్థి..! ఒకట్రెండు సంవత్సరాలు ఆగితే కుమారుడ్ని ఉన్నతస్థానంలో చూస్తామని తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు.. ఇంతలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ శవమై కనిపించాడు!. చేతికందొచ్చిన కొడుకు ఇక లేడని తెలుసుకున్న తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి.. వారిని ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. ఈ మధ్యకాలంలో ఎంబీబీఎస్ విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటూ ఉండటం గమనార్హం.


దారుణం!

పూర్తి వివరాల్లోకెళితే.. భాగ్యనగరంలోని జీడిమెట్లలో దారుణం జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంబీబీఎస్ చదువుతున్న దీక్షిత్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. పాపిరెడ్డి నగర్ రోడ్ నెంబర్-18లో ఈ ఘటన చోటుచేసుకుంది. పురుషాంగాన్ని కోసుకొని దీక్షిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుడు ఇకలేడన్న వార్త తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

కారణమేంటో..!?

కాగా.. చదువుల ఒత్తిడితోనా..? ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? వారం పదిరోజులుగా ఇంట్లోగానీ, ఫ్రెండ్స్‌తోగానీ గొడవలేమైనా జరిగాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. దీక్షిత్ మొబైల్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలియవచ్చింది. ముఖ్యంగా కాల్ డేటాపైన పోలీసులు ఫోక్స్ పెట్టినట్లు సమాచారం. ఫోన్‌లోని కాంటాక్ట్‌లతో అతడి మిత్రులను కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యనే కర్నూలు, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలు మరువక ముందే హైదరాబాద్‌లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.

Updated Date - 2023-07-09T21:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising