ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Keep in Chat: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్

ABN, First Publish Date - 2023-04-21T21:02:23+05:30

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను కట్టిపడేస్తున్న వాట్సాప్(WhatsApp) తాజాగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను కట్టిపడేస్తున్న వాట్సాప్(WhatsApp) తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను ప్రకటించింది. దీని పేరు ‘కీపిన్ చాట్’(Keep in Chat). వాట్సాప్ గతంలో తీసుకొచ్చిన డిసప్పియరింగ్ మెసేజెస్ (Disappearing Messages) ఫీచర్‌ యూజర్లకు తెగ నచ్చేసింది. అయితే, ఒకసారి డిసప్పియరింగ్ మెసేజ్ సెలక్ట్ చేస్తే అందులోని మెసేజ్‌లన్నీ ఆటోమెటిక్‌గా కనుమరుగైపోతాయి. అందులో మనకు పనికొచ్చే మెసేజ్ ఉన్నా, తరువాత మనం చూసుకుందామనకున్న మెసేజ్‌ ఉన్నా ప్రత్యేకంగా చాట్స్‌లో ఉంచుకోవడం కుదరదు. అలాంటప్పుడు ఆ చాట్స్‌కు డిసప్పియరింగ్ మెసేజ్‌ ఆప్షన్‌ను ఎంచుకోలేం.

అయితే, ఇప్పుడిలాంటి బాధ లేకుండా డిసప్పియరింగ్ మెసేజెస్‌లోని అవసరమైన మెసేజ్‌ చాట్స్ నుంచి కనుమరుగు కాకుండా ఉంచుకునేందుకు వాట్సాప్ కొత్తగా ‘కీపిన్ చాట్’ మెసేజ్‌ను తీసుకొస్తోంది. అయితే, ఏ మెసేజ్‌ను సేవ్ చేసుకోవాలనే నిర్ణయం మాత్రం అంతిమంగా పంపిన వారికే ఉంటుంది. అంటే చాటింగ్‌లోని ఏ మెసేజ్ కనిపించాలనేది సెండర్ ఇష్టాఇష్టాలపై ఆధారపడి ఉంటుందన్న మాట. యూజర్ సేవ్ చేసుకున్న మెసేజ్‌లు బుక్ మార్క్ ఐకాన్ రూపంలో కనిపిస్తాయి. కెప్ట్ మెసేజ్ ఫోల్డర్‌లో ఇవి భద్రంగా ఉంటాయి. ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా తీసుకురానుంది.

Updated Date - 2023-04-21T21:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising