ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐటీసీ మ్యాచింగ్‌ అంటే?

ABN, First Publish Date - 2023-09-03T04:51:20+05:30

ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)కు సంబంధించిన నిబంధనల్లో మ్యాచింగ్‌ నిబంధన ఒకటి. మ్యాచింగ్‌ అంటే ఒక నెలలో తీసుకునే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌.. ఆ నెలకు సంబంధించిన జీఎ్‌సటీఆర్‌-2బీ లోని మొత్తంతో సరిపోవాలి. ఈ జీఎ్‌సటీఆర్‌-2బీ అనేది మన సరఫరాదారుడు తన అమ్మకాలకు...

ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)కు సంబంధించిన నిబంధనల్లో మ్యాచింగ్‌ నిబంధన ఒకటి. మ్యాచింగ్‌ అంటే ఒక నెలలో తీసుకునే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌.. ఆ నెలకు సంబంధించిన జీఎ్‌సటీఆర్‌-2బీ లోని మొత్తంతో సరిపోవాలి. ఈ జీఎ్‌సటీఆర్‌-2బీ అనేది మన సరఫరాదారుడు తన అమ్మకాలకు అంటే మన కొనుగోళ్లకు సంబంధించి వేసే జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌ నుంచి వస్తుంది. ఉదాహరణకు ఒక వ్యాపారస్తుడు తనకు కావాల్సిన ముడి పదార్ధాలను ఒక కంపెనీ నుంచి ఆగస్టు నెలలో కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించి సదరు కంపెనీ రెండు ఇన్వాయి్‌సలు ఇచ్చింది. ఒక్కొక్క దాని విలువ రూ.లక్ష. దాని మీద చెల్లించిన జీఎ్‌సటీ రూ.18,000 అనుకుందాం. అంటే మొత్తం రూ.36,000 జీఎ్‌సటీ కింద చెల్లించటం జరిగింది. ఇప్పుడు ఆ ముడి పదార్ధాలను అమ్మిన కంపెనీ ఆగస్టు నెలలో తాను జరిపిన అమ్మకాలను ఇన్వాయిస్‌ వారీగా కొనుగోలుదారుల జీఎ్‌సటీ నంబర్‌తో సహా జీఎ్‌సటీఆర్‌-1లో చూపించటం జరుగుతుంది. ఈ వివరాలు సంబంధిత కొనుగోలుదారులకు ఆగస్టు నెల జీఎ్‌సటీఆర్‌-2బీలో కనిపిస్తాయి. అంటే పై ఉదాహరణలో ముడి పదార్ధాలను కొనుగోలు చేసిన వ్యాపారస్తుడికి తాను జీఎ్‌సటీ కింద చెల్లించిన రూ.36,000 ఆగస్టు నెల జీఎ్‌సటీఆర్‌-2బీ లో కనిపిస్తాయి. అప్పుడు మాత్రమే ఆ మొత్తాన్ని క్రెడిట్‌ కింద తీసుకోవచ్చు. ఒకవేళ అమ్మకందారుడు ఏదేనీ కారణాలతో జీఎ్‌సటీఆర్‌-1 రిటర్న్‌ వేయకున్నా లేదా కొన్ని ఇన్వాయి్‌సల వివరాలు చూపించకున్నా ఆ వివరాలు జీఎ్‌సటీఆర్‌-2బీలో కనిపించవు. కాబట్టి ఆ మొత్తం ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద తీసుకోవటానికి వీలులేదు.

ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. జీఎస్‌టీఆర్‌-2బీలో కనిపించినంత మాత్రాన ఆ మొత్తం క్రెడిట్‌ తీసుకోవటానికి వీలు లేదు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కి సంబంధించిన ఇతర నిబంధనలను కూడా చూసుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే తీసుకునే క్రెడిట్‌ జీఎ్‌సటీఆర్‌-2బీ లోని మొత్తానికి సమానంగా లేదా తక్కువగా గానీ ఉండాలి తప్ప దాని కంటే ఎక్కువ ఉండకూడదు. అయితే కొన్ని సందర్భాల్లో తీసుకునే క్రెడిట్‌ జీఎ్‌సటీఆర్‌-2బీ లో ఉన్న మొత్తం కంటే ఎక్కువ ఉండవచ్చు. ఉదాహరణకు గత నెలలో క్రెడిట్‌ జీఎ్‌సటీఆర్‌-2బీ కంటే తక్కువ తీసుకుని ఉండవచ్చు. ఆ మేర ఈ నెలలో తీసుకోవచ్చు. అలాగే విదేశాల నుంచి చేసుకునే దిగుమతులకు సంబంధించి చెల్లించిన పన్ను వివరాలు జీఎ్‌సటీఆర్‌-2బీ లో నమోదు కావు. అలాగే మరికొన్ని కారణాలు ఉండవచ్చు.

వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల కొత్త నిబంధన ప్రవేశపెట్టటం జరిగింది. దీని ప్రకారం తీసుకున్న క్రెడిట్‌ జీఎ్‌సటీఆర్‌-2బీ లోని క్రెడిట్‌ కంటే ఎక్కువ ఉంటే.. తగు వివరణ కోరుతూ డిపార్ట్‌మెంట్‌ నుంచి డీఆర్‌సీ-01సీ జారీ చేయబడుతుంది. ఇది సిస్టమ్‌ ద్వారా అంటే కామన్‌ పోర్టల్‌లో జారీ చేయటంతో పాటుగా సంబంధిత వ్యాపారస్తుడి ఈ-మెయిల్‌కు కూడా పంపబడుతుంది. డీఆర్‌సీ-01సీ లో పార్ట్‌- ఏ, పార్ట్‌- బీ అని రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌- ఏ లో జీఎ్‌సటీఆర్‌-2బీ ప్రకారం ఉన్న క్రెడిట్‌ ఎంత? తీసుకున్న క్రెడిట్‌ ఎంత? ఎంత ఎక్కువ తీసుకున్నారు? తదితర వివరాలతో తగు వివరణ కోరుతూ ఉంటుంది. డీఆర్‌సీ-01సీ అందుకున్న వ్యక్తికి రెండు ఆప్షన్స్‌ ఉంటాయి. మొదటిది ఎక్కువ తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించటం, రెండోది ఎక్కువ క్రెడిట్‌ తీసుకోవటానికి గల కారణాలను వివరించటం. ఈ రెండింటికి.. పార్ట్‌-బీ వాడాల్సి ఉంటుంది. పార్ట్‌-బీ అనేది డీఆర్‌సీ-01సీ అందిన తర్వాత వారం రోజుల లోపు కచ్చితంగా దాఖలు చేయాలి. లేకుంటే అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. అలాగే పార్ట్‌-బీ లో ఇచ్చిన వివరాలు సహేతుకంగా లేకున్నా తగు చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా పార్ట్‌-బీ అనేది సకాలంలో దాఖలు చేయకుంటే సదరు వ్యక్తికి తదుపరి జీఎ్‌సటీఆర్‌-1 దాఖలు చేయటం కుదరదు.

ఏది ఏమైనా క్రెడిట్‌ మ్యాచింగ్‌ అంశాన్ని జాగ్రత్తగా సరిచూసుకోవటంతో పాటుగా తీసుకునే క్రెడిట్‌కు సంబంధించి ఇతర నియమనిబంధనలను కూడా గమనించుకోవాలి. తగు కారణాలు ఉంటేనే జీఎ్‌సటీఆర్‌-2బీ లో ఉన్న మొత్తం కంటే ఎక్కువ క్రెడిట్‌ తీసుకోవాలి.

రాంబాబు గొండాల

గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.

Updated Date - 2023-09-03T04:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising