ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికార్డు స్థాయికి యూకో బ్యాంక్‌ లాభం

ABN, First Publish Date - 2023-05-03T02:56:52+05:30

గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికానికి యూకో బ్యాంక్‌ నికర లాభం ఆకర్షణీయంగా పెరిగింది. మొండి బకాయిలు తగ్గడంతో మార్చితో ముగిసిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

202223లో రూ.1,862 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి త్రైమాసికానికి యూకో బ్యాంక్‌ నికర లాభం ఆకర్షణీయంగా పెరిగింది. మొండి బకాయిలు తగ్గడంతో మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.581.24 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.312 కోట్లతో పోలిస్తే 86 శాతం పెరిగినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. 2022-23 ఏడాదికి గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.1,862 కోట్ల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపింది. అంతక్రితం ఏడాదిలో బ్యాంక్‌ రూ.930 కోట్ల లాభాన్ని ప్రకటించింది. కాగా మార్చి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.4,361 కోట్ల నుంచి రూ.5,946 కోట్లకు చేరింది. వార్షిక ఆదాయం రూ.20,159 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొత్తం వ్యాపారం రూ.4.11 లక్షల కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది చివరకు ఇది 3.53 లక్షల కోట్లు ఉందని.. వ్యాపారం 16.14 శాతం పెరిగిందని తెలిపింది. నికర వడ్డీ ఆదాయం రూ.6,473 కోట్ల నుంచి రూ.7,343 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకూ ఒక ఏడాదిలో బ్యాంక్‌ ఆర్జించిన అత్యధిక నికర వడ్డీ ఆదాయం ఇదే.

Updated Date - 2023-05-03T02:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising