ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వరాజ్‌ నుంచి రెండు కొత్త ట్రాక్టర్లు

ABN, First Publish Date - 2023-06-03T01:34:18+05:30

మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌.. కాంపాక్ట్‌ లైట్‌వెయిట్‌ ట్రాక్టర్ల విభాగంలోకి అడుగుపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంపాక్ట్‌ లైట్‌వెయిట్‌ విభాగంలోకి ప్రవేశం

ముంబై: మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌.. కాంపాక్ట్‌ లైట్‌వెయిట్‌ ట్రాక్టర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా మార్కెట్లోకి 20-30 హెచ్‌పీ (హార్స్‌పవర్‌) విభాగంలో టార్గెట్‌ 630, టార్గెట్‌ 625 పేరుతో కంపెనీ రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.5.35 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌). అంతేకాకుండా కాంపాక్ట్‌ లైట్‌వెయిట్‌ ట్రాక్టర్ల కోసం రూ.200 కోట్ల పెట్టుబడితో కొత్త ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ వెల్లడించింది. అలాగే కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్‌ ధోనిని నియమించుకున్నట్లు వెల్లడించింది. కాంపాక్ట్‌ లైట్‌వెయిట్‌ విభాగంలో ఏటా 50 వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయని, ఇందులో 27-30 శాతం మార్కెట్‌ వాటాను చేజిక్కించుకోవాలనేది తమ లక్ష్యమని ఎం అండ్‌ ఎం ఆటో అండ్‌ ఫామ్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ జెజూరికర్‌ తెలిపారు. తొలుత టార్గెట్‌ 630 ట్రాక్టర్‌.. మహారాష్ట్ర, కర్ణాటకల్లో అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

Updated Date - 2023-06-03T01:34:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising