ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తాన్లా లాభంలో 35% వృద్ధి

ABN, First Publish Date - 2023-07-21T01:29:20+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.135.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.135.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.100.41 కోట్లతో పోలిస్తే 35 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఇదే కాలానికి మొత్తం ఆదాయం రూ.804 కోట్ల నుంచి రూ.916 కోట్లకు చేరిందని తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ సీఈఓ, వ్యవస్థాపక చైర్మన్‌ ఉదయ్‌ రెడ్డి తెలిపారు. డిజిటల్‌ ఎకానమీ అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టి కేంద్రీకరించడానికి నిరంతరం ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మొదటి త్రైమాసికంలో వ్యాల్యూఫ్‌స్టను సొంతం చేసుకోవడం ద్వారా అంతర్జాతీయంగా కార్యకలాపాలను విస్తరించడానికి అవకాశం లభించిందన్నారు. మొదటి త్రైమాసికంలో కంపెనీ ఖాతాదారుల జాబితాలో కొత్తగా 80 కంపెనీలు చేరినట్లు చెప్పారు.

Updated Date - 2023-07-21T01:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising