ఎల్‌ఐసీ చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతి
ABN, First Publish Date - 2023-04-29T01:58:59+05:30
సిద్ధార్థ మొహంతిని ఎల్‌ఐసీ కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.
న్యూఢిల్లీ: సిద్ధార్థ మొహంతిని ఎల్‌ఐసీ కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన 2025 జూన్ ఏడో తేదీ వరకు లేదా ఆయనకు 62 సంవత్సరాలు నిండే వరకు మొహంతి పదవిలో ఉంటారు. ఆ సంస్థ మాజీ ఎండీ బీసీ పట్నాయక్‌ను ఐఆర్‌డీఏఐ మెంబర్‌గా (లైఫ్) నియమించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సారథులను ఎంపిక చేసే ఆర్థిక సేవల సంస్థల బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ) గత నెలలో మొహంతిని ఎల్‌ఐసీ చైర్మన్‌గా నియమించేందుకు సిఫారసు చేసింది.
Updated Date - 2023-04-29T01:58:59+05:30 IST