B New : బీ న్యూలో సంక్రాంతి ఆఫర్లు
ABN, First Publish Date - 2023-01-15T00:16:04+05:30
ప్రముఖ మొబైల్స్ రిటైల్ సంస్థ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్ సంక్రాంతి ఆఫర్స్‌ను ప్రకటించింది. పండగ సందర్భంగా మొబైల్స్‌తో పాటు గృహోపకరణాల కొనుగోలుపై అద్భుతమైన
హైదరాబాద్: ప్రముఖ మొబైల్స్ రిటైల్ సంస్థ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్ సంక్రాంతి ఆఫర్స్‌ను ప్రకటించింది. పండగ సందర్భంగా మొబైల్స్‌తో పాటు గృహోపకరణాల కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్లను వినియోగదారులకు అందిస్తున్నట్లు బీ న్యూ మొబైల్స్ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్ తెలిపారు. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 10 శాతం వరకు, యాక్సెసరీస్‌పై 60 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ల్యాప్‌టా్‌పపై రూ.20,000 వరకు, టీవీలపై రూ.7,000 వరకు భారీ తగ్గింపును ఇస్తున్నట్లు సాయి నితేష్ తెలిపారు. ఎస్‌బీఐ కార్డు ద్వారా చేపట్టే ప్రతి కొనుగోలుపై 5 శాతం, మొబిక్విక్ ద్వారా రూ,1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా కొనుగోలు చేస్తే రూ,6,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డు ద్వారా కొనుగోలు చేసే మొబైల్, టీవీ, ల్యాప్‌టా్‌ప్సపై జీరో శాతం డౌన్‌పేమెంట్, సున్నా శాతం వడ్డీతో వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని 150కిపైగా బీన్యూ షోరూమ్‌ల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని సాయి నితేష్ తెలిపారు.
Updated Date - 2023-01-15T00:16:06+05:30 IST