మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ
ABN, First Publish Date - 2023-06-07T02:59:22+05:30
దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం సామ్‌సంగ్.. గెలాక్సీ సిరీస్‌లో ఎఫ్54 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6.7 అంగుళాల స్ర్కీన్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 మెగాపిక్సెల్ రియర్ కెమెరా...
ధర రూ.27,999
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలకా్ట్రనిక్స్ దిగ్గజం సామ్‌సంగ్.. గెలాక్సీ సిరీస్‌లో ఎఫ్54 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6.7 అంగుళాల స్ర్కీన్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 108 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అలా్ట్ర వైడ్ లెన్స్, 2 ఎంపీ మ్యాక్రో లెన్స్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ ఫోన్ ధర రూ.27,999. మెటియోర్ బ్లూ, స్టార్‌డస్ట్ సిల్వర్ కలర్లలో లభించనుంది. ఫ్లిప్‌కార్ట్, సామ్‌సంగ్ వెబ్‌సైట్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
Updated Date - 2023-06-07T02:59:22+05:30 IST