ఆఫ్రికా మార్కెట్‌పై ఫార్మాక్సిల్ దృష్టి
ABN, First Publish Date - 2023-10-22T04:19:51+05:30
ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచడంపై ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాక్సిల్) దృష్టి పెట్టనుంది. ఉత్తర అమెరికా, యూరప్ తర్వాత...
నవంబరులో 3 దేశాలకు వ్యాపార బృందం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆఫ్రికా దేశాలకు ఎగుమతులను పెంచడంపై ఫార్మాస్యూటికల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మాక్సిల్) దృష్టి పెట్టనుంది. ఉత్తర అమెరికా, యూరప్ తర్వాత భారత్ నుంచి అత్యధికంగా ఆఫ్రికాకు భారత్ నుంచి ఔషధాల ఎగుమతులు అవుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆఫ్రికా దేశాలకు భారత్ నుంచి 364.62 కోట్ల డాలర్ల (దాదాపు రూ.30,200 కోట్లు) విలువైన ఔషధాలు ఎగుమతయ్యాయి. భారత ఔషద ఎగుమతుల్లో ఆఫ్రికా వాటా 14.36 శాతం ఉందని ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా దేశాలకు మరింతగా ఎగుమతులను పెంచడానికి ఉన్న వ్యాపార అవకాశాలను పరిశీలించడానికి భారత వ్యాపార బృందం నవంబరులో కెన్యా, ఇథియోపియా, నైజీరియా దేశాల్లో పర్యటించనునట్లు తెలిపారు. మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ కింద వ్యాపార బృందాన్ని ఫార్మాకిల్ ఈ దేశాలకు పంపుతోంది. ఆఫ్రికా దేశాల జెనరిక్ ఔషదాల మార్కెట్ విలువ దాదాపు 850 కోట్ల డాలర్ల మేరకు ఉందని.. ఇందులో భారత్ వాటా 38.25 శాతం ఉందని ఫార్మాక్సిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో నైజీరియాకు భారత కంపెనీలు 51.59 కోట్ల డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేశాయి.
Updated Date - 2023-10-22T04:19:51+05:30 IST