ఆన్‌లైన్‌లో వెండార్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
ABN, First Publish Date - 2023-01-29T01:23:48+05:30
ఉక్కు విక్రేతలుగా వీలైనంత ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు గాను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్-వైజాగ్ స్టీల్)..
ఆర్‌ఐఎన్‌ఎల్ సీఎండీ అతుల్ భట్
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): ఉక్కు విక్రేతలుగా వీలైనంత ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు గాను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్-వైజాగ్ స్టీల్).. తొలిసారిగా నేషనల్ వెండార్ ఇంటరాక్షన్ ప్రొగ్రామ్-2023ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ అతుల్ భట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉక్కు విక్రేతల కోసం ఆర్‌ఐఎన్‌ఎల్ వెబ్‌సైట్ ద్వారా వెండార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన 200 మంది విక్రేతలను నేరుగా కలవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
Updated Date - 2023-01-29T01:23:51+05:30 IST