ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌లో ఐడీఎ్‌ఫసీ విలీనం

ABN, First Publish Date - 2023-07-04T02:25:25+05:30

మాతృసంస్థ ఐడీఎ్‌ఫసీ తమతో విలీనం అవుతున్నట్టు ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ సోమవారం ప్రకటించింది. పూర్తిగా షేర్ల మార్పిడి ప్రక్రియ ద్వారా జరిగే ఈ విలీనం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మాతృసంస్థ ఐడీఎ్‌ఫసీ తమతో విలీనం అవుతున్నట్టు ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌ సోమవారం ప్రకటించింది. పూర్తిగా షేర్ల మార్పిడి ప్రక్రియ ద్వారా జరిగే ఈ విలీనం హెచ్‌డీఎ్‌ఫసీ ద్వయం అనంతరం భారత బ్యాంకిం గ్‌ రంగంలో చోటు చేసుకున్న మరో భారీ డీల్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఉభయ సంస్థల డైరెక్టర్ల బోర్డులు ఈ రివర్స్‌ మెర్జర్‌కు ఆమోదం తెలిపినట్టు ప్రకటించినప్పటికీ విలీనం తర్వాత సంస్థ మొత్తం విలువ ఎంత అనేది వెల్లడించలేదు. అయితే బీఎ్‌సఈలో సోమవారం ముగింపు సమయానికి రెండింటి షేర్ల ధర ఆధారంగా చూసినట్టయితే ఉమ్మడి విలువ రూ.71,767 కోట్లుండవచ్చునని అంటున్నారు. ఈ రివర్స్‌ విలీనంతో ఐడీఎ్‌ఫసీ షేర్‌హోల్డర్లు తమ వద్ద ఉన్న ప్రతి 100 షేర్లకు 155 ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు పొందగలుగుతారు. సోమవారం నాటి ముగింపు విలువతో పోల్చితే షేర్ల మార్పిడి నిష్పత్తి 20 శాతం ప్రీమియంతో ఉంటుంది. ఈ విలీనం రెగ్యులేటరీ సంస్థలు ఆర్‌బీఐ, సెబీ, కాంపిటీషన్‌ కమిషన్‌, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, ఉభయ సంస్థల వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుందని ఐడీఎ్‌ఫసీ బ్యాంక్‌ తెలిపింది. విలీనం అనంతరం ఐడీఎ్‌ఫసీ బ్యాంక్‌ స్టాండ్‌ అలోన్‌ బుక్‌ విలువ 4.9 శాతం పెరుగుతుంది.

Updated Date - 2023-07-04T02:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising