3 రోజులకే షేర్ల లిస్టింగ్
ABN, First Publish Date - 2023-06-29T05:01:42+05:30
పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) పూర్తయ్యాక కంపెనీలు తమ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేసేందుకు సమయాన్ని 6 నుంచి 3 రోజులకు కుదిస్తున్నట్లు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తెలిపింది.
సమయాన్ని కుదించిన సెబీ
ముంబై: పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) పూర్తయ్యాక కంపెనీలు తమ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేసేందుకు సమయాన్ని 6 నుంచి 3 రోజులకు కుదిస్తున్నట్లు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తెలిపింది. ఈ నిబంధనను రెం డు దశల్లో వర్తింపజేసింది. ఈ సెప్టెంబరు 1 లేదా ఆ తర్వాత ఐపీఓకు వచ్చే కంపెనీలకిది ఐచ్ఛికం. డిసెంబరు 1న లేదా ఆ తర్వాత పబ్లిక్ ఇష్యూలకిది తప్పనిసరి. సెబీ బోర్డు బుధవారం నాటి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సహా మొత్తం ఏడు ప్రతిపాదనలకు ఆమో దం తెలిపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు(ఎ్‌ఫపీఐ) అదనపు సమాచార వెల్లడి తప్పనిసరి చేయడంతోపాటు రీట్స్, ఇన్విట్ యూనిట్ హోల్డర్లకు బోర్డు నామినేషన్ హక్కులు కల్పించడం వంటి ప్రతిపాదనలు ఈ జాబితాలో ఉన్నాయి.
Updated Date - 2023-06-29T05:01:42+05:30 IST