Lay off : లింక్డ్‌ఇన్లోనూ ఉద్యోగాల కోత
ABN, First Publish Date - 2023-05-09T09:40:02+05:30
లింక్డ్‌ఇన్ తాజాగా లే ఆఫ్ ప్రకటించింది....
LinkedIn To Cut Jobs
లింక్డ్‌ఇన్ తాజాగా లే ఆఫ్ ప్రకటించింది. వ్యాపార నిపుణులపై దృష్టి సారించే మైక్రోసాఫ్ట్ కార్ప్ యాజమాన్యంలోని సోషల్ మీడియా నెట్‌వర్క్ లింక్డ్‌ఇన్ 716 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలిపింది.(LinkedIn To Cut Jobs) అదే సమయంలో చైనా-ఫోకస్డ్ జాబ్ అప్లికేషన్‌ను కూడా మూసివేసింది.20,000 మంది ఉద్యోగులున్న లింక్డ్‌ఇన్ గత సంవత్సరంలో ఆదాయాన్ని పెంచుకుంది. అయితే బలహీనపడుతున్న ప్రపంచ ఆర్థిక దృక్పథంతో తాజాగా ఉద్యోగాల కోత విధించాలని నిర్ణయించింది.ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు 2,70,000 కంటే అధిక టెక్ ఉద్యోగాలు తగ్గించాయి.చైనాలో అందించే స్లిమ్డ్ డౌన్ జాబ్స్ యాప్‌ను తొలగిస్తున్నట్లు లింక్డ్‌ఇన్ తెలిపింది.
Updated Date - 2023-05-09T10:09:59+05:30 IST