ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.20 లక్షల కోట్లకు భారత ఐటీ

ABN, First Publish Date - 2023-03-02T01:55:18+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భార త టెక్నాలజీ రంగం 8.4 శాతం వృద్ధితో 24,500 కోట్ల డాలర్లకు (రూ.20.09 లక్షల కోట్లు) చేరుకోవచ్చని నాస్కామ్‌ అంచనా వేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇండస్ట్రీ వృద్ధి మాత్రం 8.4 శాతానికి పరిమితం

ఉద్యోగులు మరో 2.90 లక్షలు పెరిగి 54 లక్షలకు..

2022-23 అంచనాలు విడుదల చేసిన నాస్కామ్‌

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భార త టెక్నాలజీ రంగం 8.4 శాతం వృద్ధితో 24,500 కోట్ల డాలర్లకు (రూ.20.09 లక్షల కోట్లు) చేరుకోవచ్చని నాస్కామ్‌ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత టెక్‌ రంగం ఏకంగా 15.5 శాతం వృద్ధిరేటుతో 22,600 కోట్ల డాలర్ల స్థాయి కి ఎదిగింది. కరోనా సంక్షోభ నేపథ్యంలో టెక్నాలజీపై పెట్టుబడులు అనూహ్యంగా పెరగడం గత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగానికి బాగా కలిసొచ్చింది. దాంతో దశాబ్దకాలంలో అత్యుత్తమ వార్షిక వృద్ధిరేటును నమోదు చేసుకోగలిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి 10 శాతం దిగువకే పరిమితమైంది. అయితే, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధంతో అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ సవాళ్లు పెరిగాయి. అధికధరలకు కళ్లెం వేసేందుకు అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీరే ట్లు పెంచుతూ పోతున్నాయి. దాంతో పొంచి ఉన్న ఆర్థిక మాం ద్యం ముప్పు ఐటీకి ప్రతికూలంగా పరిణమించవచ్చు.

నాస్కామ్‌ నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..

  • ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగ ఉద్యోగులు మరో 2.90 లక్షలు పెరిగి మొత్తం 54 లక్షల స్థాయికి చేరుకోనున్నారు. 2.9 లక్షల కొత్త నియామకాల్లో 1.4 లక్షల మంది మహిళలే. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగులు 4.5 లక్షల మేర పెరిగారు.

  • ఐటీ రంగంలోని 54 లక్షల మంది ఉద్యోగుల్లో 36 శాతం మంది డిజిటల్‌ నైపుణ్యాల్లో శిక్షణ పొంది ఉన్నారు. ఈ 54 లక్షల్లో 20 లక్షల మంది మహిళలు.

  • భారత ఐటీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 9.4 శాతం పెరిగి 19,400 కోట్ల డాలర్లకు చేరుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవ ల సోర్సింగ్‌లో భారత్‌దే 57-58 శాతం వాటా. ఇక దేశీయంగా ఆదాయం 13 శాతం పెరిగి రూ.4.12 లక్షల కోట్లకు చేరుకోవచ్చు.

  • 2030 నాటికి టెక్నాలజీ రంగ సైజు 50,000 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా.

భవిష్యత్‌పై జాగ్రత్తతో కూడిన ఆశావహం

ఐటీ రంగ భవిష్యత్‌పై నిర్వహించిన సర్వేలో ఇండస్ట్రీ సీఈఓలు జాగరూకతతో కూడిన ఆశావహాన్ని వ్యక్తం చేశారని నాస్కామ్‌ వెల్లడించింది. అంతేకాదు, 2023-24 లక్ష్యాలను వెల్లడించేందుకు సైతం నిరాకరించారని ఈ అసోసియేషన్‌ పేర్కొంది. ఇదిలా ఉండగా చాలామంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో ఉపాధి నైపుణ్యం కొరవడుతోందని, ఫలితంగా ఫ్రెషర్ల శిక్షణపై ఐటీ కంపెనీలు చాలా సమయాన్ని, డబ్బును వెచ్చించాల్సి వస్తోందని ఘోష్‌ అన్నారు.

Updated Date - 2023-03-02T01:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!