ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యాప్‌జెమినీ ఇన్నోవేషన్‌ కేంద్రంగా హైదరాబాద్‌

ABN, First Publish Date - 2023-05-05T03:35:02+05:30

: వివిధ రంగాల్లోని ఖాతాదారుల (కంపెనీలు) వ్యాపార అవసరాలకు ఇన్నోవేటివ్‌ ప్లాట్‌ఫామ్స్‌, సొల్యూషన్లను అభివృద్ధి చేయడంలో క్యాప్‌జెమినీకి హైదరాబాద్‌ ఇన్నోవేషన్‌ కేంద్రంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐఈలో మెటావర్స్‌, అనలిటిక్స్‌ టెక్నాలజీలపై దృష్టి

ఫైనాన్షియల్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు సేవలు

సీనియర్‌ డైరెక్టర్‌ రంజన్‌ ప్రధాన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వివిధ రంగాల్లోని ఖాతాదారుల (కంపెనీలు) వ్యాపార అవసరాలకు ఇన్నోవేటివ్‌ ప్లాట్‌ఫామ్స్‌, సొల్యూషన్లను అభివృద్ధి చేయడంలో క్యాప్‌జెమినీకి హైదరాబాద్‌ ఇన్నోవేషన్‌ కేంద్రంగా ఉంది. హైదరాబాద్‌లోని అప్లైడ్‌ ఇన్నోవేషన్‌ ఎక్స్ఛేంజీ (ఏఐఈ) కేంద్రం ఫైనాన్షియల్‌ సేవలు, లైఫ్‌ సైన్సెస్‌, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, కన్స్యూమర్‌ గూడ్స్‌ రంగాల్లోని కంపెనీలకు వినూత్న ప్లాట్‌ఫామ్‌లు, సొల్యూషన్లను అభివృద్ధి చేస్తోందని క్యాప్‌జెమినీ హైదరాబాద్‌ అప్లైడ్‌ ఇన్నోవేషన్‌ ఎక్స్ఛేంజీ సీనియర్‌ డైరెక్టర్‌ రంజన్‌ ప్రధాన్‌ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా క్యాప్‌జెమినీకి 22 ఇన్నోవేషన్‌ కేంద్రాలు ఉన్నాయి. భారత్‌లో హైదరాబాద్‌, ముంబై ల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. వివిధ కేంద్రాలకు చెందిన ఆయా రంగాల్లోని నిపుణులు, ఖాతాదారులు కలిసి తమ అవసరాలకు అనుగుణంగా కొత్త సొల్యూషన్లు, ప్లాట్‌ఫామ్‌లను హైదరాబాద్‌ ఏఐఈలో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్‌ ఏఐఈలో మెటావర్స్‌, ఎనలిటిక్స్‌, టెక్నోవిజన్‌, అగ్‌మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), రోబోటిక్స్‌ వంటి ఎమర్జింగ్‌ టెక్నాలజీలకు ప్రత్యేక జోన్లు ఉన్నాయని రంజన్‌ చెప్పారు.

డేటాను విశ్లేషించే టెలిమ్యాటిక్స్‌

ఆటో, ప్రాపర్టీ, లైఫ్‌, హెల్త్‌ రంగాల్లోని కంపెనీల కోసం అభివృద్ధి చేసిన టెలిమ్యాటిక్స్‌.. డేటాను విశ్లేషించి వాహన రంగంలో డ్రైవర్‌ తీరుతెన్నులను వెల్లడిస్తుందని, దీని ప్రకారం ఇన్సూరెన్స్‌ కంపెనీలు బీమా ప్రీమియంలను నిర్ణయించడానికి వెసులుబాటు ఉంటుందని వివరించారు. అలానే హెల్త్‌కేర్‌ రంగంలో డేటాను విశ్లేషించి హెల్త్‌ బీమా ప్రీమియంలను, ఫిట్‌నెస్‌ మొదలైన వాటిని నిర్ణయించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. అలానే ఫైనాన్షియల్‌ సేవలు, రిటైల్‌ రంగంలోని కంపెనీలకు వివిధ సొల్యూషన్లు, యాప్‌లను క్యాప్‌జెమినీ హైదరాబాద్‌లోని ఇన్నోవేషన్‌ కేంద్రంలో అభివృద్ధి చేస్తోంది. స్టార్టప్‌లతో కూడా హైదరాబాద్‌ ఇన్నోవేషన్‌ కేంద్రం కలిసి పనిచేస్తోంది. ఇన్నోవేటివ్‌ ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో స్టార్టప్‌లకు మెంటారింగ్‌ చేస్తోంది.

హైదరాబాద్‌లో 29,500 మంది నిపుణులు

హైదరాబాద్‌లో క్యాప్‌జెమినీకి రెండు ప్రాంగణాలు ఉన్నాయి. వీటితో పాటు ఇన్నోవేషన్‌ కేంద్రం పనిచేస్తోంది. దేశ వ్యాప్తంగా క్యాప్‌జెమినీకి 1,85,000 మంది నిపుణులు ఉండగా.. హైదరాబాద్‌లో 29,500 మంది పని చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల్లో సగానికి సగం మంది భారత్‌లోనే ఉన్నారని రంజన్‌ తెలిపారు.

Updated Date - 2023-05-05T03:35:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising