ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 20% వృద్ధి

ABN, First Publish Date - 2023-01-15T00:12:58+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబరు-డిసెంబరు) హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 19.9 శాతం పెరిగి రూ.12,698

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబరు-డిసెంబరు) హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 19.9 శాతం పెరిగి రూ.12,698 కోట్లకు ఎగబాకింది. కీలక వడ్డీ ఆదాయంలో మెరుగైన వృద్ధి ఇందుకు ప్రధానంగా దోహదపడింది. సమీక్షా కాలానికి కీలక వడ్డీ ఆదాయం 24.6 శాతం వృద్ధితో రూ.22,987.8 కోట్లకు చేరుకుంది. రుణాలు 19.5 శాతం వృద్ధి చెందాయి. నికర వడ్డీ మార్జిన్‌ (ఎన్‌ఐఎం) 4.1 శాతంగా నమోదైంది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలలకు బ్యాంక్‌ ఇతర ఆదాయం కూడా రూ.8,499.84 కోట్లకు పెరిగింది. కాగా, నిర్వహణ ఖర్చులు కూడా 26.5 శాతం పెరుగుదలతో రూ.12,463.6 కోట్లకు చేరుకున్నాయి. ఇక ఆస్తుల నాణ్యత విషయానికొస్తే, డిసెంబరు చివరినాటికి బ్యాంక్‌ మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 1.23 శాతంగా నమోదయ్యాయి.

Updated Date - 2023-01-15T00:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising