GST : జీఎస్‌టీ వసూళ్లు.. రూ.1.65 లక్షల కోట్లు
ABN, First Publish Date - 2023-08-02T02:27:48+05:30
దేశంలో జీఎ్‌సటీ వసూళ్లు జూలై నెలలో 11 శాతం పెరిగి రూ.1,65,105 కోట్లకు చేరాయి. ప్రభుత్వం ఎగవేతలను అరికట్టేందుకు తీసుకున్న కఠిన చర్యలు, అధిక వినియోగ వ్యయాలు...
ఈస్థాయి దాటడం ఇది ఐదోసారి
న్యూఢిల్లీ: దేశంలో జీఎ్‌సటీ వసూళ్లు జూలై నెలలో 11 శాతం పెరిగి రూ.1,65,105 కోట్లకు చేరాయి. ప్రభుత్వం ఎగవేతలను అరికట్టేందుకు తీసుకున్న కఠిన చర్యలు, అధిక వినియోగ వ్యయాలు వసూళ్లు పెరగడానికి ఊతం ఇచ్చాయి. దేశంలో జీఎ్‌సటీ ప్రవేశపెట్టిన తర్వాత నెలవారీ పన్ను వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు దాటడం ఇది ఐదోసారి కావడమే కాకుండా ఇప్పుడిది కొత్త ఒరవడిగా మారిందని అంటున్నారు. గత ఏడాది జూలై నెల జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లుగా ఉన్నాయి. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెల జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లు, మే నెలలో రూ.1.57 లక్షల కోట్లుగా ఉన్నాయి. జూలై నెల వసూళ్లలో సీజీఎ్‌సటీ రూ.29,773 కోట్లుగా ఉండగా ఎస్‌జీఎ్‌సటీ రూ.37,623 కోట్లు, ఐజీఎ్‌సటీ రూ.85,930 కోట్లుగా ఉండగా సెస్ వసూళ్లు రూ.11,779 కోట్లుగా ఉన్నాయి.
నేడే కౌన్సిల్ సమావేశం
జీఎ్‌సటీ కౌన్సిల్ బుధవారం నిర్వహిస్తున్న సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రప్పందాలపై 28 శాతం పన్ను విధింపునకు సంబంధించిన సరఫరా విలువ నిర్ధారణ విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది. జూలై 11వ తేదీ న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో నిర్వహించిన సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను వసూలుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన లా కమిటీ సరఫరా విలువ నిర్ధారణకు మార్గదర్శకాలు రూపొందించింది. బుధవారం నాటి సమావేశంలో లా కమిటీ సిఫారసులపై చర్చించి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది.
ఆటోమేటెడ్ ఐజీఎ్‌సటీ వాప్‌సకు పరిమితులు విధింపు
పాన్ మసాలా, పొగాకు, హుక్కా, గుట్కా, పైప్‌లలో ఉపయోగించే స్మోకింగ్ మిశ్రమాలు, సిగరెట్లు, మెంథా ఆయిల్ సహా అదే శ్రేణిలోకి వచ్చే ఇతర వస్తువుల ఎగుమతిపై ఐజీఎ్‌సటీ ఆటోమేటెడ్ రిఫండ్ విధానంపై అక్టోబరు 1వ తేదీ నుంచి పరిమితులు విధిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జూలై 31న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇక నుంచి ఎగుమతిదారులు రిఫండ్ క్లెయిమ్‌లతో సంబంధిత ప్రాంత పన్ను అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
Updated Date - 2023-08-02T05:28:34+05:30 IST