ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు

ABN, First Publish Date - 2023-10-02T02:35:49+05:30

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధితో రూ.1.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబరులో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి....

సెప్టెంబరు వసూళ్లలో 11 శాతం వృద్ధి

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు నెలలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 10 శాతం వృద్ధితో రూ.1.62 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబరులో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబరులో జీఎ్‌సటీ వసూళ్లు రూ.1,62,712 కోట్లుగా ఉన్నాయి. జీఎ్‌సటీ వసూళ్లు 1.6 లక్షల కోట్లకు ఎగువన ఉండటం ఇది నాలుగో నెల. సెప్టెంబరులో సెంట్రల్‌ జీఎ్‌సటీ (సీజీఎ్‌సటీ) రూ.29,818 కోట్లు, స్టేట్‌ జీఎ్‌సటీ (ఎస్‌జీఎ్‌సటీ) రూ.37,657 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎ్‌సటీ (ఐజీఎ్‌సటీ) రూ.83,623 కోట్లుగా (దిగుమతి వస్తువుల నుంచి వసూలైన రూ.41,145 కోట్లు సహా) నమోదైంది. కాగా, సెస్‌ రూపంలో మరో రూ.11,613 కోట్లు (దిగుమతి వస్తువుల ద్వారా సమకూరిన రూ.881 కోట్లు సహా) వసూలయ్యాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థం (ఏప్రిల్‌-సెప్టెంబరు)లో మొత్తం జీఎ్‌సటీ వసూళ్లు రూ.9,92,508 కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సగటున ప్రతి నెల వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. జీఎ్‌సటీ ఆదాయపరంగా ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24) రికార్డు ఆరంభం లభించింది. ఏప్రిల్‌లో స్థూల వసూళ్లు సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1.87 లక్షల కోట్లకు ఎగబాకాయి. కాగా ప్రతి నెల వసూళ్లు రూ.1,6 లక్షల కోట్ల ఎగువన ఉండటం సాధారణమైందని, ఈ పండగల సీజన్‌లో జీఎ్‌సటీ ఆదాయం మరింత పెరిగే అవకాశాలున్నాయని కేపీఎంజీ పార్ట్‌నర్‌ అండ్‌ పరోక్ష పన్నుల విభాగ నేషనల్‌ హెడ్‌ అభిషేక్‌ జైన్‌ అన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎ్‌సటీ ఆదాయం

నెల రూ.కోట్లు

ఏప్రిల్‌ 1,87,035

మే 1,57,090

జూన్‌ 1,61,497

జూలై 1,65,105

ఆగస్టు 1,59,069

సెప్టెంబరు 1,62,712

Updated Date - 2023-10-02T02:35:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising