దశాబ్ది చివరికి లిస్టింగ్ : ఆకాశా ఎయిర్
ABN, First Publish Date - 2023-10-23T05:01:35+05:30
ఆకాశా ఎయిర్ ఈ దశాబ్ది చివరికి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయ్యే యోచనలో ఉంది. ఇప్పటివరకు భారత పౌర విమానయాన రంగంలో స్పైస్‌జెట్, ఇండిగో మాత్రమే లిస్టింగ్ కంపెనీలు...
న్యూఢిల్లీ: ఆకాశా ఎయిర్ ఈ దశాబ్ది చివరికి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయ్యే యోచనలో ఉంది. ఇప్పటివరకు భారత పౌర విమానయాన రంగంలో స్పైస్‌జెట్, ఇండిగో మాత్రమే లిస్టింగ్ కంపెనీలు. త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడంతో పాటు మూడంకెల్లో కొత్త విమానాలకు ఆర్డర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆకాశా ఎయిర్.. ప్రస్తుతం 16 దేశీయ గమ్యాల్లో వారానికి 750 సర్వీసులు నడుపుతోంది. ఐపీఓ జారీ చేయడానికి ముందు మరింత చరిత్ర నమోదు చేసుకోవాలనుకుంటున్నామని, ఈ దశాబ్ది చివరికి ఇష్యూకి వచ్చే అంశం పరిశీలిస్తున్నామని కంపెనీ సీఈఓ వినయ్ దూబే తెలిపారు
చౌక ధరల కస్టమర్లపై ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫోకస్
టాటాల యాజమాన్యంలోని ఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ చౌక ధరలకు ప్రయాణాలు చేసే వారు, విహార యాత్రికులకు సేవలందించడంపై దృష్టి సారిస్తుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా సర్వీసులు విస్తరించడం కన్నా ప్రస్తుతం నడుస్తున్న రూట్లలోనే తమ స్థితిని పటిష్ఠం చేసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు.
Updated Date - 2023-10-23T05:01:35+05:30 IST