రెనో నుంచి ఎలక్ట్రిక్ క్విడ్
ABN, First Publish Date - 2023-08-22T01:53:45+05:30
ఫ్రాన్స్ కార్ల కంపెనీ రెనో వచ్చే 3-4 ఏళ్లలో 9 కొత్త మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలనుకుంటోంది...
ధర రూ.10 లక్షల లోపు ఉండే అవకాశం
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ కార్ల కంపెనీ రెనో వచ్చే 3-4 ఏళ్లలో 9 కొత్త మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టాలనుకుంటోంది. అందులో భాగంగా తన ఎంట్రీ లెవెల్ కారు క్విడ్‌లో ఎలక్ట్రిక్ వెర్షన్ సహా రెండు ఈవీలను అందుబాటులోకి తేవాలనుకుంటోంది. తొలి ఈవీ మోడల్‌ను వచ్చే ఏడాది చివర్లో లేదా 2025లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు రెనో ఇండియా సీఈఓ, ఎండీ వెంకట్ మామిళ్లపల్లె తెలిపారు. డాసియా స్ర్పింగ్ ఎలక్ట్రిక్ రూపంలో ఇప్పటికే యూరప్ మార్కెట్లో అమ్ముడవుతున్న క్విడ్ ఈవీ ధర భారత్‌లో రూ.10 లక్షల లోపు ఉండవచ్చని అంచనా. ప్రస్తుతం దేశీ య మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎంట్రీలెవెల్ ఎలక్ట్రిక్ కార్లైన టాటా టియాగో ఈవీ, ఎంజీ కోమెట్ ఈవీ, సిట్రోయెన్ ఈ సీ3కి పోటీగా దీన్ని తీసుకురానున్నట్లు తెలిసింది.
Updated Date - 2023-08-22T01:53:45+05:30 IST