ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాక్‌ ఆధారిత విధానం బెటర్‌..

ABN, First Publish Date - 2023-04-24T01:12:18+05:30

ఈవారం దేశీయ ఈక్విటీ మార్కెట్ల గమనాన్ని కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలతో పాటు డెరివేటివ్స్‌ ముగింపు నిర్దేశించే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈవారం దేశీయ ఈక్విటీ మార్కెట్ల గమనాన్ని కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలతో పాటు డెరివేటివ్స్‌ ముగింపు నిర్దేశించే అవకాశం ఉంది. మరోవైపు వచ్చే నెలలో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్ల పెంచవచ్చన్న అంచనాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపించవచ్చు. టెక్నికల్‌గా చూస్తే మార్కెట్లో కొద్దిగా కరెక్షన్‌ కనిపిస్తోంది. అయితే ఎలాంటి అప్రమత్త ధోరణిని సూచించటం లేదు. ఈ వారం నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో సాగితే 17,700-17,800 వద్ద నిరోధాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకుంటే మరింత అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. ఒకవేళ డౌన్‌ట్రెండ్‌ను సూచిస్తే మాత్రం 17,500 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ట్రేడర్లు దేశీయ, అంతర్జాతీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ బై ఆన్‌ డిప్స్‌ (పడితే కొనుగోలు చేయటం) వ్యూహాన్ని అనుసరించటం బెటర్‌. అలాగే ఆర్థిక ఫలితాల సీజన్‌ కావటంతో స్టాక్‌ ఆధారిత వ్యూహాన్ని అనుసరించటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

మహీంద్రా హాలిడేస్‌ అండ్‌ రిసార్ట్స్‌ (ఎంహెచ్‌ఆర్‌ఐఎల్‌): గడిచిన రెండు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేరులో బలమైన కొనుగోళ్ల ట్రెండ్‌ కనిపించింది. క్లోజింగ్‌ ప్రాతిపదికన చూస్తే బ్రేకౌట్‌ సాధించినట్లు కనిపిస్తోంది. డెయిలీ, వీక్లీ టైమ్‌ ఫ్రేమ్‌ చార్టులను గమనిస్తే ట్రెండ్‌ బుల్లి్‌షగా ఉంది. రానున్న రోజుల్లో ఈ షేరు ఇదే జోరును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం రూ.301 వద్ద క్లోజైన ఈ షేరును రూ.326 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.285 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ట్రెంట్‌ లిమిటెడ్‌: గత వారం ఈ షేరు పటిష్ఠంగా సాగుతూ కన్సాలిడేషన్‌ జోన్‌ నుంచి బయటపడింది. డెయిలీ చార్టుల ప్రకారం చూస్తే ఈ షేరులో కొంత కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇది ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నట్లు టెక్నికల్స్‌ సూచిస్తున్నాయి. గత శుక్రవారం రూ.1,383.35 వద్ద క్లోజైన ఈ షేరును రూ.1,440 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,340 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

-ఓషో కృష్ణన్‌, సీనియర్‌ ఎనలిస్ట్‌, టెక్నికల్‌,

డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌

Updated Date - 2023-04-24T01:12:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising