కెనరా బ్యాంక్ ‘ప్రీమియం పేరోల్’ ఖాతా
ABN, First Publish Date - 2023-04-04T03:25:12+05:30
తమ బ్యాంకులో జీతా ల ఖాతా ప్రారంభించే ఉద్యోగుల కోసం, ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంకు సరికొత్త ఖాతా తీసుకొచ్చింది. ‘ప్రీమియం పేరోల్ ప్యాకేజి’ పేరుతో ప్రారంభించిన ఈ ఖాతా ద్వారా...
బెంగళూరు: తమ బ్యాంకులో జీతా ల ఖాతా ప్రారంభించే ఉద్యోగుల కోసం, ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంకు సరికొత్త ఖాతా తీసుకొచ్చింది. ‘ప్రీమియం పేరోల్ ప్యాకేజి’ పేరుతో ప్రారంభించిన ఈ ఖాతా ద్వారా, ఉద్యోగులు అనేక ప్రత్యేక సదుపాయాలు అందుకోవచ్చు. ఉచిత టర్మ్ ఇన్సూరెన్స్, ఇన్‌స్టా ఓవర్ డ్రాఫ్ట్, ఉచిత వ్యక్తిగత, ఎయిర్ యాక్సిడెంట్ బీమా కవరేజి, ప్రీమియం కార్డ్స్ వంటి అనేక సదుపాయాలు ఈ శాలరీ అకౌంట్ ద్వారా లభిస్తాయి. ఉద్యోగుల అన్ని అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఖాతాను డిజైన్ చేసినట్టు కెనరా బ్యాంకు ఎండీ, సీఈఓ కె.సత్యనారాయణ రాజు తెలిపారు.
Updated Date - 2023-04-04T03:25:14+05:30 IST