ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంఎ్‌సఎన్‌ నుంచి రొమ్ము క్యాన్సర్‌ ఔషధం

ABN, First Publish Date - 2023-01-18T00:39:56+05:30

తుది దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు వినియోగించే పాల్బోసిక్లిబ్‌ టాబ్లెట్లను హైదరాబాద్‌కు చెందిన ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ విడుదల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచంలో తొలిసారిగా టాబ్లెట్ల రూపంలో

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తుది దశలో ఉన్న రొమ్ము క్యాన్సర్‌ చికిత్సకు వినియోగించే పాల్బోసిక్లిబ్‌ టాబ్లెట్లను హైదరాబాద్‌కు చెందిన ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ విడుదల చేసింది. 75, 100, 125 ఎంజీ సామర్థ్యా ల్లో ఈ టాబ్లెట్లను తీసుకువచ్చింది. ప్రపంచంలో టాబ్లెట్ల రూపంలో జెనరిక్‌ పాల్బోసిక్లిబ్‌ ఔషధాన్ని విడుదల చేసిన మొదటి కంపెనీ తమదేనని ఎంఎ్‌సఎన్‌ గ్రూప్‌ వెల్లడించింది. ‘పాల్బోరెస్ట్‌’ బ్రాండ్‌తో పాల్బోసిక్లిబ్‌ టాబ్లెట్లను కంపెనీ విక్రయిస్తుంది. ఇప్పటివరకూ ఈ ఔషధాన్ని విక్రయిస్తున్న కంపెనీలు క్యాప్సుల్స్‌ రూపంలో విక్రయిస్తున్నాయి. క్యాప్సుల్స్‌ రూపంలో కంటే టాబ్లెట్‌ రూపంలో తీసుకున్నప్పుడు వివిధ ప్రయోజనాలు ఉంటాయని.. ఆహారం తీసుకోకుండానే టాబ్లెట్‌ను తీసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. 125 ఎంజీ పాల్బోరెస్ట్‌ టాబ్లెట్‌ ధర రూ.257.14గా ఉండగా 100 ఎంజీ ధర రూ.233.28, 75 ఎంజీ ధర రూ.214.29గా ఉన్నాయి. యూఎస్‌ ఎఫ్‌డీఏ/ఈయూ నియంత్రణ సంస్థ ఆమోదం పొందిన యూనిట్లలో పాల్బోసిక్లిబ్‌ ఏపీఐ, ఫార్ములేషన్లను తయారు చేయనున్నట్లు తెలిపింది.

Updated Date - 2023-01-18T00:39:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising