ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిగ్‌ ‘సి’ 20వ వార్షికోత్సవ ఆఫర్‌ రెండో లక్కీ డ్రా

ABN, First Publish Date - 2023-01-12T00:56:23+05:30

మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ బిగ్‌ ‘సి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని బిగ్‌ ‘సి’ సంస్థ ఫౌండర్‌, సీఎండీ యం బాలు చౌదరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మొబైల్‌ రిటైల్‌ చెయిన్‌ బిగ్‌ ‘సి’ 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని బిగ్‌ ‘సి’ సంస్థ ఫౌండర్‌, సీఎండీ యం బాలు చౌదరి అన్నారు. ఈ ఆఫర్‌లో భాగంగా మొత్తం మూడు లక్కీ డ్రాలలో విజేతలుగా ఎంపికైన కస్టమర్లకు 20 మారుతి సుజుకీ ఆల్టో కార్లు, 20 బజాజ్‌ ప్లాటినా బైక్స్‌, 20 రిఫ్రిజిరేటర్లు, 20 ఏసీలు, 20 టీవీలను బహుమతులుగా అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 29 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా బుధవారం నాడు బిగ్‌ ‘సి’ రెండో లక్కీ డ్రాలో మొత్తం 35 మంది విజేతలను ప్రకటించింది. విజేతలకు 7 మారుతి సుజుకీ ఆల్టో కార్లు, 7 బజాజ్‌ ప్లాటినా బైక్స్‌, 7 రిఫిజిరేటర్లు, 7 ఏసీలు, 7 టీవీలను అందించనుంది. అలాగే ప్రతి మొబైల్‌, టీవీ, ల్యాప్‌టాప్‌ కొనుగోలుపై రూ.4,000 వరకు విలువ గల బహుమతితో పాటు 3,000 వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌, సులభ వాయిదాల పద్ధతిలో వడ్డీ, ఎలాంటి డౌన్‌ పేమెంట్‌ లేకుండా మొబైల్‌ కొనుగోలు చేసే సదుపాయం అందుబాటులో ఉందని బాలు చౌదరి తెలిపారు. దీంతో పాటు యాక్సెసరీస్‌ కొనుగోలుపై కచ్చితమైన బహుమతిని ఇవ్వనున్నట్లు చెప్పారు.

Updated Date - 2023-01-12T00:56:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising