‘ఆటో’ విక్రయాలు అంతంతే
ABN, First Publish Date - 2023-08-02T02:13:51+05:30
దేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు జూలై నెలలో అంతంత మాత్రంగానే సాగా యి. అయితే ఎస్‌యూవీ విభాగంలో మాత్రం అమ్మకాలు జోరుగా సాగాయి...
జూలైలో స్వల్ప వృద్ధితో సరి
న్యూఢిల్లీ: దేశంలో ఆటోమొబైల్ అమ్మకాలు జూలై నెలలో అంతంత మాత్రంగానే సాగా యి. అయితే ఎస్‌యూవీ విభాగంలో మాత్రం అమ్మకాలు జోరుగా సాగాయి. మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకీ, హ్యుండయ్ మోటార్స్ అమ్మకాలు మాత్రం ఒకే అం కె వృద్ధిని నమోదు చేశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 29ు వృద్ధిని సాధించగా టాటా మోటార్స్ పరిమిత వృద్ధితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మారుతి జూలైలో 1,52,126 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,42,850 కార్లతో పోల్చితే 6ు వృద్ధిని నమోదు చేసింది. హ్యుండయ్ కార్ల అమ్మకాలు గత జూలైతో పోల్చితే 50,500 నుంచి 50,701 యూనిట్లకు చేరాయి. టాటా మోటార్స్ అమ్మకాలు స్వల్పంగా పెరిగి 47,628 యూనిట్లకు చేరాయి. మహీంద్రా అమ్మకాలు 29 శాతం పెరిగి 36,205 యూనిట్లకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్ విక్రయాలు 21,911 యూనిట్లుగా ఉన్నాయి. కాగా టూవీలర్ కంపెనీ బజాజ్ ఆటో అమ్మకాలు 2ు తగ్గి 1,79,263 యూనిట్లుగా నమోదయ్యాయి. హీరో మోటో విక్రయాలు ఏకంగా 12ు తగ్గుదలతో 3,91,310 యూనిట్లకు చేరుకున్నాయి. సుజుకీ మోటార్ సైకిల్ 80,309 వాహనాలను విక్రయించింది.
Updated Date - 2023-08-02T02:13:51+05:30 IST