ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆటుపోట్లకు చాన్స్‌ !

ABN, First Publish Date - 2023-06-26T01:49:43+05:30

ఈ వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లలోనే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బక్రీద్‌ కారణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లకు సెలవు. అలాగే గురువారం జూన్‌ నెల ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ వారం దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లలోనే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బక్రీద్‌ కారణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లకు సెలవు. అలాగే గురువారం జూన్‌ నెల ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టులు ముగుస్తుండటంతో పాటు అంతర్జాతీయ ట్రెండ్స్‌ ఈ వారం మార్కెట్లపై ప్రభావం చూపించే వీలుంది. గతవారం నిఫ్టీ సరికొత్త గరిష్ఠ స్థాయిలను తాకేందుకు చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం సఫలం కాలేదు. టెక్నికల్‌గా చూస్తే నిఫ్టీ 18,880 స్థాయిల వద్ద బలమైన నిరోధం ఎదుర్కొంటోంది. కీలకమైన ఈ స్థాయిలకు ఎగువన నిలదొక్కుకుంటేనే స్వల్పకాలానికి బుల్లిష్‌ ధోరణిని కనబరిచే వీలుంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే నిఫ్టీ 20 ఈఎంఏకు స్వల్ప ఎగువన క్లోజైంది. అవర్లీ చార్టుల ప్రకా రం నిఫ్టీ ‘బేరిష్‌ డబుల్‌ టాప్‌’ ప్యాట్రన్‌లో ఉంది. ఈ వా రం 18,600-18,650 స్థాయిలకు ఎగువన ట్రేడయితే బుల్లిష్‌ ధోరణిని కనబరిచే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో కరెక్షన్‌లోకి జారుకుని 18,500-18,450 స్థాయిలకు చేరుకునే వీలుంది. ఒకవేళ ఏదేనీ అప్‌ట్రెండ్‌ను సూచిస్తే మాత్రం 18,750 వద్ద సత్వర నిరోధ స్థాయిలుంటాయి. ఈ స్థాయిలను అధిగమిస్తే మాత్రం ఆల్‌ టైమ్‌ హై స్థాయి 18,888 దిశగా సాగే వీలుంది. గత కొద్ది నెలలుగా మార్కెట్‌ అప్‌ట్రెండ్‌లో సాగుతున్న సమయంలో అవకాశాలను అందిపుచ్చుకోలేని ట్రేడర్లు... ప్రస్తుత కరెక్షన్‌ సమయంలో కొనుగోళ్లపై దృష్టి పెట్టవచ్చు.

స్టాక్‌ రికమండేషన్స్‌

డాక్టర్‌ రెడ్డీస్‌: గడచిన కొద్ది సెషన్లుగా ఈ కౌంటర్‌లో బలమైన కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. క్లోజింగ్‌ ప్రాతిపదికన చూస్తే మాత్రం బ్రేకౌట్‌తో ‘వీ’ షేప్‌ రికవరీ కనిపిస్తోంది. డైలీ టైమ్‌ ఫ్రేమ్‌ చార్టుల ప్రకారం చూస్తే బుల్లిష్‌ ధోరణిని సూచిస్తోంది. సమీప భవిష్యత్తులో ఈ షేరు జో రును కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత శుక్రవా రం రూ.4,993.90 వద్ద క్లోజైన ఈ షేరును రూ.5,300 టార్గె ట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.4,820 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

డాబర్‌: ఈ షేరు గత వారం బలమైన బ్రేకౌట్‌ను సాధించి 200 ఎస్‌ఎంఏను అధిగమించింది. డైలీ చార్టుల ప్రకారం చూస్తే 21 డీఈఎంఏతో మరోసారి బుల్లిష్‌ ధోరణిని ఏర్పరచుకుంది. టెక్నికల్‌గా చూస్తే సమీప కాలంలో ఈ షేరు అప్‌ట్రెండ్‌లో సాగే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.563.35 వద్ద క్లోజైన ఈ షేరును రూ.595 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవ చ్చు. అయితే రూ.540 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఓషో కృష్ణన్‌, సీనియర్‌ ఎనలిస్ట్‌,

టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2023-06-26T01:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising