రూ.2,000 వరకు పెరిగిన టన్ను స్టీల్
ABN, First Publish Date - 2023-03-09T01:41:14+05:30
దేశంలో స్టీల్ ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. గత నెల ద్వితీయార్ధంలో రూ.59,000 ఎగువ స్థాయిలో నమోదైన టన్ను స్టీల్.. గతవారంలో రూ.2,000 వరకు పెరిగి రూ.61,000 స్థాయికి చేరుకుంది..
న్యూఢిల్లీ: దేశంలో స్టీల్ ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. గత నెల ద్వితీయార్ధంలో రూ.59,000 ఎగువ స్థాయిలో నమోదైన టన్ను స్టీల్.. గతవారంలో రూ.2,000 వరకు పెరిగి రూ.61,000 స్థాయికి చేరుకుంది. ఐరన్ ఓర్, బొగ్గు వంటి ముడి సరుకుల ధరలతోపాటు ఉక్కు గిరాకీ కూడా పెరగడం ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. భౌగోళిక, రాజకీయ అనిశ్చితులు అంతర్జాతీయంగా ముడిసరుకులు, కమోడిటీల రవాణాపై ప్రభావం చూపుతున్నాయని వారన్నారు.
Updated Date - 2023-03-09T01:41:14+05:30 IST