ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒక్క విద్యార్థీ చేరలేదు!

ABN, First Publish Date - 2023-07-21T03:14:43+05:30

ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 319 పాఠశాలల్లో కొత్తగా ఒక్క విద్యార్థీ చేరలేదు. అందులో 201 ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలుంటే, 118 ప్రభుత్వ బడులున్నాయి.

319 పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు

అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 319 పాఠశాలల్లో కొత్తగా ఒక్క విద్యార్థీ చేరలేదు. అందులో 201 ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలుంటే, 118 ప్రభుత్వ బడులున్నాయి. వైసీపీ ప్రభుత్వం గతేడాది ఏకపక్షంగా చేపట్టిన తరగతుల విలీనం ప్రక్రియ బడులపై పిడుగులా పడింది. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి మరింత దిగజారింది. మరోవైపు ఈ ఏడాది 2వేలకు పైగా ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపునకు పడిపోవడంతో వాటిని ఏకోపాధ్యాయ స్కూళ్లుగా మార్చేశారు. రాష్ట్రంలో 9,602 సింగిల్‌ టీచర్‌ స్కూళ్లు ఉంటే వాటిలో దాదాపు సగం బడుల్లో పిల్లలు పది మంది కూడా లేరు. పాఠశాల విద్యాశాఖ నిబంధనల ప్రకారం 20మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను కేటాయించింది. ఆ సంఖ్య దాటితే రెండో టీచర్‌ను ఇస్తారు. కానీ 20మందిలోనూ సగమే ఉంటే వాటిని విలీనం చేయడమే నయమనే ఆలోచనలో ఉంది. జీరో అడ్మిషన్లు ఉన్న పాఠశాలలను ఇతర పాఠశాలల్లో కలపాలని మౌఖికంగా క్షేత్రస్థాయికి ఆదేశాలు అందినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-07-21T03:14:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising