వైసీపీ వైఫల్యాలను ‘తెర’పై ఎండగడదాం!
ABN, First Publish Date - 2023-05-02T03:11:21+05:30
వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలను తెరలపై ప్రదర్శించి ప్రజల ముందు ఎండగట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది.
వెబెక్స్ మీటింగ్‌లో బీజేపీ చార్జిషీట్ కమిటీ నిర్ణయం
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలను తెరలపై ప్రదర్శించి ప్రజల ముందు ఎండగట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. గ్రామ పంచాయతీల నుంచి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ జాబితాను సిద్ధం చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో 13 మందితో ఏర్పాటైన చార్జిషీట్ కమిటీ సభ్యులతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం సోమవారం వెబెక్స్ మీటింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ.. పార్టీ తరఫున సేకరించిన సమాచారాన్ని చార్జిషీట్లలో పొందుపరుస్తూనే నియోజకవర్గాల్లో తెరలపై ప్రదర్శించాలని నిర్ణయించామని చెప్పారు.
Updated Date - 2023-05-02T03:11:21+05:30 IST