ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌కు నూకలు చెల్లాయి

ABN, First Publish Date - 2023-07-08T03:10:32+05:30

జగన్‌కు నూకలు చెల్లాయని, జగన్‌కు సీఎం సీటు కాదు కదా.. పులివెందులలో ఎమ్మెల్యే సీటు కూడా రాదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం కాకినాడలో జరిగిన ‘భవిష్యత్తుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం సీటే కాదు.. పులివెందుల సీటే రాదు

కాకినాడ భవిష్యత్తుకు గ్యారెంటీ సభలో యనమల

కాకినాడ సిటీ, జూలై 7: జగన్‌కు నూకలు చెల్లాయని, జగన్‌కు సీఎం సీటు కాదు కదా.. పులివెందులలో ఎమ్మెల్యే సీటు కూడా రాదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం కాకినాడలో జరిగిన ‘భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర’ సభలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. టీడీపీ నేతలు పులివెందులలో పర్యటించినప్పుడు ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారని, జగన్‌ను ఓడించాలనే కసి వారిలో కనిపించిందని చెప్పారు. మన ప్రాంతంలో కొంచెం సంశయిస్తున్నారని, ప్రజల్లో తెగింపు రావాలని అన్నారు. పులివెందుల్లోని బంకర్లలో జగన్‌ అక్రమ సంపాదన అంతా ఉందని, టీడీపీ అధికారంలోకి రాగానే దాన్ని బయటకు తీయించి ప్రజలకు పంచుతామని తెలిపారు. నాలుగేళ్లలో ప్రజల మీద రూ.13వేలకోట్ల భారం మోపాడని, జగన్‌ పెద్ద దోపిడీదారుడని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే పార్టీ శ్రేణులపై అక్రమ కేసులను ఒక సంతకంతో తీయించేస్తామని, మూసివేసిన వైసీపీ వాళ్ల కేసులను తిరగదోడుతామని తెలిపారు. మరో పొలిట్‌బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ జగన్‌కు మళ్లీ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తాడన్న విషయం ప్రజలు గ్రహించారన్నారు.

Updated Date - 2023-07-08T03:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising