ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవడ్రా నువ్వు.. ఎక్కడ నుంచి వచ్చావు?

ABN, First Publish Date - 2023-05-11T05:32:30+05:30

‘ఎవడ్రా నువ్వు. నీ పేరేమిటి?. సస్పెండ్‌ చేయిస్తా.. ఏమనుకుంటున్నావో..’ అంటూ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గ్రంథాలయ ఉద్యోగులను దుర్భాషలాడారు. గ్రంథాలయాల్లో విద్యార్థులకు ప్రభుత్వం వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమానికి సంబంధించి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫ్లెక్సీపై ఫొటో ఎందుకు వేయలేదు.. సస్పెండ్‌ చేయిస్తా

గ్రంథాలయ ఉద్యోగులపై కైకలూరు ఎమ్మెల్యే తిట్ల దండకం

ముదినేపల్లి రూరల్‌, మే 10: ‘ఎవడ్రా నువ్వు. నీ పేరేమిటి?. సస్పెండ్‌ చేయిస్తా.. ఏమనుకుంటున్నావో..’ అంటూ కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గ్రంథాలయ ఉద్యోగులను దుర్భాషలాడారు. గ్రంథాలయాల్లో విద్యార్థులకు ప్రభుత్వం వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరం కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఓ గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తన ఫొటోలేదని ఎమ్మెల్యేకు తెలిసింది. సదరు గ్రంథాలయ మహిళా అధికారిణిని ఎమ్మెల్యే నాగేశ్వరరావు మంగళవారం తన కార్యాలయానికి పిలిపించి, ఫ్లెక్సీపై తన ఫొటో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. ఆ ఫ్లెక్సీలు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి వచ్చాయని ఆమె చెప్పారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే.. ‘ఎవడాడు.. మీపై అధికారి ఫోన్‌ నంబర్‌ ఇవ్వు..’ అంటూ రగిలిపోయారు. మచిలీపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థలో పనిచేసే యూడీసీకి ఫోన్‌ చేసి తిట్ల దండకం అందుకున్నారు. ఫ్లెక్సీపై స్థానిక ఎమ్మెల్యే ఫొటో ఉండనవసరం లేదా.. అంటూ దూషించారు. కార్యదర్శిపై సైతం ఎమ్మెల్యే ఆగ్రహంతో రగిలిపోయారు. చివరకు ఎమ్మెల్యే, ఎంపీపీ ఫొటోలతో కొత్త ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-05-11T05:32:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising