ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YSRTP : వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏమిటి..?

ABN, First Publish Date - 2023-10-14T04:46:09+05:30

కాంగ్రెస్‌లో విలీనం కుదరకపోవడంతో ఒంటరిగానే వైఎస్సార్టీపీ తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..

  • ప్రముఖ సిద్ధాంతితో వైఎస్‌ విజయలక్ష్మి చర్చలు

  • ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి స్వల్ప ప్రమాదం

ఒంగోలు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ తల్లి వైఎస్‌ విజయలక్ష్మి శుక్రవారం ఒంగోలులోని ప్రముఖ సిద్ధాంతితో సమావేశమయ్యారు. మధ్యా హ్నం ఒంగోలు చేరుకున్న ఆమె ముందుగా టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి, అనారోగ్యంతో ఉన్న ఆయన తల్లిని పరామర్శించారు. ఆ తర్వాత సిద్ధాంతి అద్దేపల్లి హనుమంతరావును ఆయన నివాసంలో కలిశారు. సుమారు 3గంటలపాటు ఆయన ఇంట్లో రాజరాజేశ్వరి అమ్మవారి పీఠం వద్ద ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఆమె కుమార్తె షర్మిల ఆధ్వర్యంలోని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అభ్యర్థులకు బీ-ఫాంలు ఇచ్చేందుకు మంచి ముహూర్తం, షర్మిల రాజకీయ భవిష్యత్తుపై సిద్ధాంతితో మాట్లాడినటు సమాచారం. గతంలో కూడా విజయలక్ష్మి ఒంగోలు వచ్చి ఆయా ఎన్నికల సందర్భంలో సిద్ధాంతి హనుమంతరావు ద్వారా మంచిచెడు లు చర్చించేవారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆమె సిద్ధాంతిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఆమె ఒంగోలు వచ్చే మార్గంలో పిడుగురాళ్ల, సంతమాగులూరు మధ్యలో ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. కారు వెనుక భాగం కొంత దెబ్బతిన్నప్పటికీ.. అదే వాహనంలో ప్రయాణించి వచ్చారు.

Updated Date - 2023-10-14T09:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising