ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువగళం

ABN, First Publish Date - 2023-01-27T01:12:30+05:30

రాష్ట్రంలో యువతకు స్ఫూర్తినిచ్చేలా.. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజలను చైతన్యపరిచేలా ‘సైకో పాలన పోయి సైకిల్‌ పాలన’ తీసుకురావాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం కుప్పంలో యువగళం పాదయాత్ర చేపట్టనున్నారు.

ముసునూరు నుంచి ద్వారకా తిరుమల వరకు పాదయాత్రగా బయలుదేరిన తెలుగు యువత నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ శ్రేణుల్లో ఉరిమిన ఉత్సాహం.. ఊరూ వాడా సంబరాలు

కుప్పం వెళ్లిన గన్ని, చింతమనేని సహా ముఖ్య నేతలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో యువతకు స్ఫూర్తినిచ్చేలా.. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజలను చైతన్యపరిచేలా ‘సైకో పాలన పోయి సైకిల్‌ పాలన’ తీసుకురావాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం కుప్పంలో యువగళం పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాద యాత్ర విజయవంతం కావాలని కాంక్షిస్తూ పార్టీ శ్రేణులు ఆయనకు సంఘీభావం ప్రకటించాయి. పలుచోట్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువగళం పాదయాత్ర పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నియోజకవర్గమైన కుప్పం నుంచి శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కన్వీనర్‌లు, ముఖ్యులంతా గురువారమే అక్కడకు బయలుదేరి వెళ్లారు. పాదయాత్ర ఆరంభ సూచికగా కుప్పంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నందున వీరంతా సభకు హాజరవుతున్నారు. కుప్పంలో ఏర్పాటు చేసిన వేదికపై చేరేలా ముఖ్యులందరికి వీఐపీ పాస్‌లను పార్టీ సమకూర్చింది. ఇప్పటికే వారం రోజులుగా యువగళంకు నేతలంతా తమ గళం కలిపారు. గ్రామాల్లో ఒకింత చైతన్యం తెచ్చారు. ర్యాలీలు చేశారు. యువత విభాగం మరింత ఉత్సాహపూరిత వాతావరణంలో పెద్ద సంఖ్యలో కుప్పం వెళ్లడమే కాకుండా ఏలూరు జిల్లా అంతా ఎక్కడిక్కడ ర్యాలీలు చేశారు.

మేమున్నాం మీవెంట

లోకేశ్‌ యాత్ర జనం మధ్య సాగేలా పార్టీ తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ప్రకటిస్తూ సంఘీభావంగా సోషల్‌ మీడియాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. నియోజకవర్గ పార్టీ కన్వీనర్‌లు చింతమనేని ప్రభాకర్‌, బడేటి చంటి, బలగం శ్రీనివాసరావు, ముదరబోయిన వెంకటేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ సహా సీనియర్‌ నేతలంతా గురువారం మధ్యాహ్నానికే కుప్పం బయలుదేరి వెళ్లారు. వీరితోపాటు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, మాజీ జడ్పీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు, శ్యామసుందర్‌, పాలి ప్రసాద్‌, దాసరి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు తదితరులంతా తమ అనుచరులతో కలిసి అట్టహాసంగా కుప్పం వెళ్లారు. ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. సైకో పాలన పోయి.. సైకిల్‌ పాలన రావాలి’ అని అన్ని వర్గాలు కోరుతున్నాయి. లోకేశ్‌ తలపెట్టిన పాదయాత్రలో మమేకం కావాలి. యువత, మహిళలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలన్ని సంఘీభావంగా వెంట కదలాలి. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి చెందాలంటా ఈ యాత్ర విజయవంతం చేయాల్సిందే’ పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు.

పూజలు.. పాదయాత్రలు

లోకేశ్‌ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జిల్లా అంతట పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు కదిలాయి. ముసునూరు నుంచి చినవెంకన్న క్షేత్రం ద్వారకా తిరుమల వరకు భారీ సంఖ్యలో పాద యాత్రకు దిగారు. మహిళలు, హారతులు ఇవ్వగా ఈ యాత్ర ద్వారకా తిరుమల వైపు ఒక దండులా సాగింది. చిన వెంకన్నకు ప్రత్యేక పూజలు చేసి లోకేశ్‌ యాత్ర విజయవంతం అయ్యేలా ఏర్పాట్లకు దిగారు. గడిచిన రెండు రోజులుగా ఎక్కడికక్కడ గ్రామ దేవతలు త మ ఇష్ట దైవాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజలు చేస్తూ వచ్చారు. దీనికితోడు గురువారం మహిళలతో పాటు కార్యకర్తలంతా ఉదయం వేళల్లో దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. టి.నరసాపురంలో లోకేశ్‌ యాత్ర విజయవంతం కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేశారు. కైకలూరులో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పేదలకు అండగా మేమంతా అండగా లోకేశ్‌కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్ని మండల కేంద్రా ల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపించింది. స్వచ్ఛందంగా కార్యకర్తలు ఎక్కడిక్కడ కార్యకర్తలు ఉత్సాహంతో లోకేశ్‌ యాత్ర విజయవంతం కావాలంటూ రంగంలోకి దిగి స్థానికులను చైతన్యపరిచారు.

Updated Date - 2023-01-27T01:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising