పట్టించుకోరా..?
ABN, First Publish Date - 2023-06-26T00:06:49+05:30
రోడ్డుభద్రత నిబంధనల పేరుతో నిత్యం వాహనదారులకు అపరాధ రుసుం విధించే రాష్ట్ర ప్రభుత్వం రహదారుల భద్రతపై మాత్రం దృష్టి సారించకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటుగానే వెళ్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
అయినా పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదన
(నూజివీడు టౌన్)
రోడ్డుభద్రత నిబంధనల పేరుతో నిత్యం వాహనదారులకు అపరాధ రుసుం విధించే రాష్ట్ర ప్రభుత్వం రహదారుల భద్రతపై మాత్రం దృష్టి సారించకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు మండలం దిగవల్లి గ్రామ పరిధిలోని నూజివీడు–ధర్మాజీగూడెం ప్రధాన రహదారి ఇదిగో ఇలా కోతకు గురై దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు గానీ, ఇతర శాఖలు గానీ కనీసం దృష్టి సారించకపోవడంపై దిగవల్లి గ్రామస్థులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇదే రహదారిపై ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాలను సందర్శించే సందర్భంలోనూ రహదారి కోతకు గురైన విషయం కనిపించలేదా? లేక తమకెందుకులే అని అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారా? అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు రహదారి మార్జిన్ కోతకు గురి కాగా అది క్రమేణా పెరుగుతూ రహదారి వరకు వచ్చిందని ఈ ఏడాది భారీ వర్షాలు నమోదైతే రహదారి పూర్తిగా కోతకు గురయ్యే ప్రమాదం ఉందని, నిధుల కొరత అంటూ ఆర్‌అండ్‌బీ శాఖ కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చకుండా వదిలేసిందని, కనీసం ‘ఉపాధి’ హామీ పథకాంలో గానీ లేదా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ సమస్యల్లో గాని గండిని పూడ్చాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - 2023-06-26T00:06:49+05:30 IST