భీమవరంలో అంబేడ్కర్ స్టడీ సర్కిల్
ABN, First Publish Date - 2023-02-18T00:30:37+05:30
భీమవరం పేరుకే జిల్లా కేంద్రం. ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రాజెక్ట్‌లు మంజూరు కాలేదు. జిల్లా కేంద్రమైతే పట్టణ రూపురేఖలు మారిపోతాయని అంతా ఆశించారు. ్జకేవలం జిల్లా కార్యాలయాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. అయితే తొలిసారిగా అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సాంఘిక సంక్షేమ శాఖ ముందుకొచ్చింది.
గునుపూడి ఎస్సీ కార్పొరేషన్ స్థలంలో నిర్మాణానికి సన్నాహాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భీమవరం పేరుకే జిల్లా కేంద్రం. ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రాజెక్ట్‌లు మంజూరు కాలేదు. జిల్లా కేంద్రమైతే పట్టణ రూపురేఖలు మారిపోతాయని అంతా ఆశించారు. ్జకేవలం జిల్లా కార్యాలయాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. అయితే తొలిసారిగా అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు సాంఘిక సంక్షేమ శాఖ ముందుకొచ్చింది. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు కృషి ఫలించింది. అంబేడ్కర్ స్టడీ సర్కిల్ కోసం అంచనాలు రూపొందించి పంపా లని సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కలెక్టర్‌కు సూచించింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ఇంజనీర్లు అంచనాలు రూపొందించారు. భీమవరం గునుపూడిలోని ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన 60 సెంట్లు స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలం ఇతర అవసరాలకు ఉపయోగించడానికి వీలు లేదు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దాదాపు రూ.13 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ కాంపోనెట్ నుంచి నిధులు కేటాయించాల్సి ఉంది. నిధులు మంజూరైన అనంతరం టెండర్లు పిలవనున్నారు. సివిల్స్ పరీక్షలు రాసే విద్యార్థులకు అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ అందిస్తారు. ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఇది ఉపయోగపడనుంది.
Updated Date - 2023-02-18T00:30:38+05:30 IST