ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదేం పరీక్ష!

ABN, First Publish Date - 2023-01-31T00:42:30+05:30

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం కోసం పెట్టిన వయస్సు నిబంధన అర్హులకు అడ్డుకట్ట వేస్తోంది. నవోదయ స్కూళ్లలో ఆరో తరగతిలోకి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌లో నవోదయ విద్యాలయ సమితి 2013 ఏప్రిల్‌ 30వ తేదీ లోపల పుట్టిన వారు మాత్రమే ప్రవేశ పరీక్షకు అర్హతగా నిర్ధారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు కొత్త నిబంధన

2013 ఏప్రిల్‌ 30వ తేదీ లోపు పుట్టిన వారే అర్హులట

అనర్హులుగా మారనున్న ఎందరో విద్యార్థులు

ఆగస్టు 21 వరకు జరిగిన స్కూల్‌ అడ్మిషన్లు

కొత్త నిబంధనతో అడ్మిషన్లకు ఆటంకమే

భీమవరం ఎడ్యుకేషన్‌, జనవరి 30 : జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం కోసం పెట్టిన వయస్సు నిబంధన అర్హులకు అడ్డుకట్ట వేస్తోంది. నవోదయ స్కూళ్లలో ఆరో తరగతిలోకి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌లో నవోదయ విద్యాలయ సమితి 2013 ఏప్రిల్‌ 30వ తేదీ లోపల పుట్టిన వారు మాత్రమే ప్రవేశ పరీక్షకు అర్హతగా నిర్ధారించారు. దాంతో అనేక మంది విద్యార్థులు నష్టపోనున్నారు. ఏటా ఆగస్టు 31వ తేదీ వరకు అడ్మిషన్లు నిర్వహిస్తుంటారు. ఐదో తరగతిలో చేరే విద్యార్థులకు ఆ లెక్కనే వయస్సు పరిగణలోకి తీసుకుని అడ్మిషన్లు కల్పిస్తారు. అంటే జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో పుట్టిన తేదీ ఉన్నవారు కూడా ఐదో తరగతిలో అడ్మిషన్లు పొందారు. అలాంటి వారు కొత్త నిబంధన వల్ల నవోదయ పరీక్షకు అనర్హులవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,630 మంది విద్యార్థులు 5వ తరగతి చదువుతున్నారు. వీరిలో 50 శాతం మందితో నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయించాలన్న సూచనలు జిల్లా వైద్యశాఖ అధికారుల నుంచి వస్తున్నట్టు సమాచారం అంటే 6 వేలకు పైగా దరఖాస్తులు రావాలి. గతేడాది 6 వేలు వరకు వచ్చాయి. ఈ ఏడాది వయస్సు నిబంధనతో ఈ సంఖ్య తగ్గడం ఖాయమని హెచ్‌ఎంలు చెబుతున్నారు. తొలుత ఈనెల 31తో దరఖాస్తుకు ఆఖరు తేదీ అని ప్రకటించినా గడువు తేదీని ఫిబ్రవరి 8వ తేదీ వరకు పెంచడంతో కొంత ఊరట లభించింది. అయితే వయస్సు నిబంధన సడలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కొన్ని పాఠశాలల్లో వయస్సు నిబంధన లేకుండా దరఖాస్తు చేశారు. వాటికి అనుమతి ఇస్తారో లేదో చూడాలి.

Updated Date - 2023-01-31T00:42:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising