భీమవరం డివిజన్‌లో కలపండి..
ABN, First Publish Date - 2023-03-17T00:09:29+05:30
గణపవరం మండలాన్ని తాడేపల్లిగూడెం డివిజన్‌లో కాకుండా భీమవరం డివిజన్ లోనే కొనసాగించాలని గణపవరం మండల ప్రజాప్రతి నిధులు తహసీల్దార్ సీహెచ్‌యూ కృష్ణస్వామి, ఎంపీడీవో జ్యోతిర్మయికి గురువారం వినతిపత్రం అందించారు.
అధికారులకు మండల ప్రజాప్రతినిధులు వినతి పత్రం అందజేత
గణపవరం, మార్చి 16 : గణపవరం మండలాన్ని తాడేపల్లిగూడెం డివిజన్‌లో కాకుండా భీమవరం డివిజన్ లోనే కొనసాగించాలని గణపవరం మండల ప్రజాప్రతి నిధులు తహసీల్దార్ సీహెచ్‌యూ కృష్ణస్వామి, ఎంపీడీవో జ్యోతిర్మయికి గురువారం వినతిపత్రం అందించారు. మండలంలోని 25 గ్రామాల సర్పంచ్‌లు, మండలం సర్పంచ్‌ల ఛాంబర్ అధ్యక్షురాలు చనుమూరి లక్ష్మీభవాని, ఎంపీపీ దండు వెంకటరామరాజు, జడ్పీటీసీ దేవరపు సోమాలక్ష్మి, తదితరులు భీమవరం డివిజన్‌లోనే ఉంచా లని ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు తెలపాలని ఆ వినతి పత్రంలో కోరారు. వాస్తవానికి ఏలూరు జిల్లాలోని గణప వరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేసి తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. అభ్యంత రాలు ఉంటే తెలపాలంటూ ప్రభుత్వం పేర్కొంటూ ప్రజ ల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది. ఈనెల 16వ తేదీతో గడువు ముగిసింది. ఈక్రమంలోనే మండల ప్రజాప్రతినిధులు భీమవరం డివి జన్‌లో ఉంచాలంటూ వినతిపత్రాలు అందించారు. గణప వరం మండలానికి భీమవరం అతిచేరువలో ఉండడం వల్ల అధికశాతం మక్కువ చూపుతున్నారు.
Updated Date - 2023-03-17T00:09:29+05:30 IST